Sunday, December 22, 2024

వైద్య కళాశాల ఏర్పాటుకు హర్షం

- Advertisement -
- Advertisement -
  • ముఖ్యమంత్రి, మంత్రిలకు కృతజ్ఞతలు తెలిపిన ప్రభుత్వవిప్ సునీత

యాదాద్రి భువనగిరి: యాదాద్రి ఆలయ అభివృద్ధిలో భాగంగా యాదగిరిగుట్టకు ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయడంతో ప్రభుత్వవిప్,ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి తోపాటూ ఈ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. గురువారం ప్రభుత్వవిప్ గొంగిడి సునీతా వైద్య కళాశాల ఏర్పాటుపై హర్షం వ్యక్తం చేస్తు, కళాశాల మంజూరిపై ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రి హరీష్ రావు, కెటిఆర్, జగదీశ్‌రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు.

యాదాద్రి ఆలయ అభివృద్ధితో దేశ నలుమూలలనుండే కాక విదేశాలనుండి కూడా భక్తుల రాక పెరిగిందని దానికి అనుకులంగా యాదగిరిగుట్టకు వంద పడకల అసుప్రతి ముంజూరి చేయడంతో దానికి అనుసందానంగా వైద్య శాలకావలాని ముఖ్యమంత్రిని, మంత్రులను కలవడం జరిగిందని దానికి సానుకులంగా వైద్య కళశాల మంజూరి చేయడం హర్షనీయమని ప్రభుత్వవిప్ అన్నారు. వంద పడకల అసుప్రతి తోపాటూ, వైద్య కళాశాల నిర్మాణం కోసం త్వరలో స్థల సేకరణ చేసి నిర్మాణ పనులు ప్రారంభిస్తామని ప్రభుత్వవిప్ తెలిపారు. హైదరాబాదులో ఆరోగ్యశాఖ మంత్రి హరిష్ రావును కలిసి కృతజ్ఞతో పష్ఫగుచ్ఛాన్ని అందచేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News