Monday, December 23, 2024

హైకోర్టును ఆశ్రయించిన హర్షసాయి..

- Advertisement -
- Advertisement -

లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న యూట్యూబర్ హర్షసాయి రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. లైంగిక ఆరోపణల కేసులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు.ఇటీవల హర్షసాయి నటి మిత్రా శర్మ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తనను హర్షసాయి లైంగికంగా వేధించారని ఆరోపిస్తూ కేసు పెట్టింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేయడంతో అతను పరార్ అయినట్లు వార్తలు కూడా వచ్చాయి. ఈ క్రమంలో అతనికి పోలీసులు లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు. దీంతో కోర్టును ఆశ్రయించాడు. హర్షసాయి బెయిల్ పిటిషన్‌పై మంగళవారం మధ్యాహ్నం న్యాయస్థానం విచారణ చేపట్టనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News