- Advertisement -
హెరాక్లియాన్(గ్రీస్): ప్రపంచ జూనియర్ వెయిట్ లిఫ్టింగ్‌చాంపియన్‌షిప్‌లో భారత యువ సంచలనం హర్షదా గరూడ్ స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించింది. జూనియర్ వరల్డ్ వెయిట్‌లిఫ్టింగ్ పోటీల్లో పసిడి పతకం సాధించిన తొలి భారత క్రీడాకారిణి హర్షదా గరూడ్ నిలిచింది. మహిళల 45 కిలోల విభాగంలో పోటీ పడిన హర్హదా రికార్డు స్థాయిలో 153 కిలోల బరువును ఎత్తి స్వర్ణం సొంతం చేసుకుంది. టర్కీకి చెందిన బెక్తాస్ కాన్సూ రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని దక్కించుకుంది. ఇక 18 ఏళ్ల మహారాష్ట్రకు చెందిన హర్షదా ఇటీవల కాలంలో నిలకడైన ఆటతో అలరిస్తోంది. ఖేలో ఇండియా పోటీల్లో, ఆసియా చాంపియన్‌షిప్ టోర్నీల్లో పతకాలు సాధించి సత్తా చాటింది. తాజాగా వరల్డ్ జూనియర్ పోటీల్లో ఏకంగా స్వర్ణం సాధించి దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటింది.
Harshada Garud win Silver in Jr Weightlifting Championship
- Advertisement -