Sunday, December 22, 2024

బోనస్ మాట బోగస్: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో పత్తి యార్డు సందర్శనకు వచ్చిన సీసీఐ అధికారులపై పత్తి రైతులు సోమవారం తిరగబడ్డ విషయం తెలిసిందే. ఖమ్మం జిల్లాలో రెండు రోజుల పర్యటనలో భాగంగా హరీష్ రావు పత్తి రైతులను కలిశారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ..  కాంగ్రెస్‌ బోనస్‌ పెద్ద బోగస్‌ అని.. సర్కారు మరో ఎన్నికల హామీని తుంగలో తొక్కిందని  మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని,6500 రూపాయలు కూడ మద్దతు ధర పత్తికి రాలేదని, పత్తి ప్రతి క్వింటాకు రైతుకు 1500 నష్టం వాటిల్లుతుందన్నారు.లక్షా ఇరవై వేల మెట్రిక్ టన్నులు కూడా పత్తి కొనలేదు మొత్తం దళారులకే పోతుందని ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టడం కుట్రలు చేయడం తప్ప కాంగ్రెస్ చేసింది జీరో అని హరీష్ రావు అన్నారు.వరి,పత్తి పంట దళారుల పాలు అవుతుంది ప్రభుత్వం ఏమి చేస్తోందని,రైతు బంధు లేని రుణమాఫీ లేని మద్దతు ధర లేదని రైతులు ఆవేదన చెందుతున్నారన్నారు.

కెసిఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పత్తికి గరిష్టంగా 11 వేలు కనిష్టంగా 9 వేలు ధర పలికిందని,ఇప్పుడు ఎందుకు ధర తగ్గిందన్నారు. పత్తి రైతులకు మద్దతు ధర రావాలి 500 బోనస్ ఇవ్వాలని ప్రభుత్వం ను డిమాండ్ చేస్తున్నామన్నారు. సిసిఐ రైతుల దగ్గర కొనట్లేదు దళారుల దగ్గర కొంటున్నారు.మిర్చి కి 13 వేలు కూడా రాటల్లేడు. జిల్లా మంత్రులు ఆధిపత్యం కోసం బాగా బిజీ అయ్యారు.ప్రజా సమస్యలను గాలి కొదిలి గొప్పలుకు పోతున్నారన్నారు. సన్నాలకు బోనస్ కూడా ఇవ్వట్లేదని, ఖమ్మం జిల్లాలో సన్నాలు 4 లక్షల మెట్రిక్ టన్నుల దాన్యం పండిందని, ఒక్క రైతుకు అయినా బోనస్ ఇచ్చారా మొత్తం దళారులు కొంటున్నారన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News