Sunday, January 19, 2025

రేపే హర్యానా, జమ్మూకశ్మీర్ ఓట్ల లెక్కింపు

- Advertisement -
- Advertisement -

హర్యానా, జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఓట్ల లెక్కింపు రేపు జరుగనున్నది. ఉదయం 8 గంటల నుంచే ఓట్ల లెక్కింపు మొదలు కానున్నది. హర్యానాలో బిజెపి  మూడో సారి గెలుపు కోసం చూస్తోంది. అయితే కాంగ్రెస్ అధికారం కైవసం చేసుకోవాలనుకుంటోంది.జెజెపి, ఐఎన్ఎల్ డి వంటి అనేక స్థానిక పార్టీలు తల్లక్రిందులు చేయాలనుకుంటున్నాయి.

ఇక జమ్మూకశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై అందరికీ ఆసక్తి ఉంది. నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ మిత్రపక్షం తప్పక విజయం సాధిస్తాయనుకుంటున్నారు. ఆ రెండు ఇండియా బ్లాక్ లో ఉన్న పార్టీలే. పిడిపి ఆశ్చర్యకర ఫలితాలను సాధించాలనుకుంటోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News