Sunday, January 19, 2025

ప్రియురాలి భర్తను చంపి… పశువులశాలలో మృతదేహాన్ని పాతిపెట్టి

- Advertisement -
- Advertisement -

ఛండీఘఢ్: ప్రియుడు తన ప్రియురాలి భర్తను చంపి అనంతరం మృతదేహాన్ని తన పశువుల శాలలో పాతిపెట్టిన సంఘటన హర్యానా రాష్ట్రం పానిపట్టు జిల్లాలో జరిగింది. పట్టి కల్లాన్ గ్రామంలో రవి అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి జీవిస్తున్నాడు. రవి భార్య ప్రవీణ్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. తన భార్యతో ప్రవీణ్ అనే వ్యక్తి అక్రమ సంబంధం పెట్టుకున్నాడని ఈ మధ్యనే రవికి తెలిసిందే. రవి, తన కుటుంబంతో కలిసి కారు కొనడానికి డిసెంబర్ 11న కర్నాల్‌కు వెళ్లాడు. రవికి ప్రవీణ్ ఫోన్ చేసి మద్యం సేవిద్దామని కబురు పంపాడు.

మద్యం గ్లాసులో పాయిజన్ కలిపి రవికి ఇచ్చాడు. రవి స్పృహ కోల్పోయిన వెంటనే అతడి తలపై ప్రవీణ్ పదునైనా ఆయుధంతో కొట్టి హత్య చేశాడు. వెంటనే మృతదేహాన్ని పశువుల శాలలో పాతిపెట్టాడు. అదే రోజు తన కుమారుడు కనిపించడంలేదని రవి తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణలో భాగంగా ప్రవీణ్‌ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉండడంతో హత్య చేశానని ఒప్పుకున్నాడు. వెంటనే అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News