Sunday, January 19, 2025

మేకప్, నగలు వేసుకుని ఆస్పత్రికి రావద్దు..

- Advertisement -
- Advertisement -

చండీగఢ్: ఆస్పత్రుల్లో పనిచేసే సిబ్బందికి హర్యానా ప్రభుత్వం నూతన డ్రెస్‌కోడ్ విధానాన్ని తీసుకు వచ్చింది. ఇకపై ఆస్పత్రి సిబ్బంది ఫంకీ హెయిర్ స్టైల్, భారీ నగలు, మేకప్ వేసుకుని విధులకు రావడాన్ని అనుమతించబోమని స్పష్టం చేసింది. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసే ఉద్యోగుల్లో క్రమశిక్షణ, ఏకత్వం, సమానత్వం, ఉండాలనే ఉద్దేశంతో ఈ డ్రెస్‌కోడ్ పాలసీని రూపొందించినట్టు రాష్ట్ర ఆరోగ్య మంత్రి అనిల్‌విజ్ వెల్లడించారు. అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు, ము ఖ్యంగా ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసే వైద్యులు ఇతర సిబ్బంది పని వేళల్లో విచిత్రమైన హెయిర్‌స్టైళ్లు, భారీ నగలు, మేకప్, పొడవాటి గోళ్లు, స్కర్టులు ధరించడా న్ని అనుమతించబోం. పురుషులు అసాధారణ హెయిర్ స్టైళ్లు, మోడర్న్ హెయిర్ కట్, చేసుకుని రావద్దు. గోళ్లు శుభ్రంగా ఉండాలి.

టీ షర్టులు, జీన్స్‌లు, స్కర్టులు, లెదర్ ప్యాంట్లు, క్రాప్‌టాప్‌లు వంటి దుస్తులు ప్రొఫెషనల్‌గా కన్పించవు. అందువల్ల వాటిని అనుమతించబోం. ప్రొఫెషనల్‌గా కన్పించే ఫార్మల్ దుస్తులనే ధరించాలి. నర్సింగ్ క్యాడర్ మినహా ట్రైనీలు తప్పనిసరిగా నల్లఫ్యాంట్, తెల్లషర్టు ధరించాలి అని అనిల్ విజ్ తెలిపారు. ఈ డ్రెస్ కోడ్‌ను సిబ్బంది తప్పనిసరిగా పాటించాలని, వారాంతాలు, నైట్ షిప్టుల్లోనూ ఉన్న సిబ్బందికి కూడా వస్త్రధారణలో ఎలాంటి మినహాయింపు లేదని వివరించారు. డ్రెస్ కోడ్ పాటించకపోతే ఆ ఉద్యోగి ఆరోజు గైరు హాజరీగా పరిగణిస్తామని మంత్రి పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News