Monday, December 23, 2024

వృద్ధురాలిపై హర్యానా సిఎం ఖట్టర్ ఔదార్యం

- Advertisement -
- Advertisement -

Haryana CM Gives Rs 2500 to Elderly Woman

చండీగఢ్: హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ గురువారం తన ఔదార్యాన్ని చాటుకున్నారు. పెన్షన్ లభించక ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఒక వృద్ధురాలికి తన జేబులో నుంచి రూ.2,500 అందచేసి వెంటనే ఆమె వృద్ధాప్య పెన్షన్‌ను పునరుద్ధరించాలని అధికారులను ఆయన ఆదేశించారు. జన్ సంవాద్ కార్యక్రమం సందర్భంగా రోహ్తక్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది. కుటుంబ గుర్తింపు పత్రాలను సమర్పించడంలో పొరపాట్ల కారణంగా వృద్ధాప్య పెన్షన్ అందడం లేదని పెద్దసంఖ్యలో వృద్ధులు ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు. వెంటనే డాటాను సరిచేసి అందరికీ పెన్షన్‌తోపాటు ఇతర ప్రయోజనాలను పునరుద్ధరించాలని ముఖ్యమంత్రి ఖట్టర్ సామాజిక న్యాయం, సాధికారత శాఖ అధికారులను ఆదేశించారు. తన సొంత జేబులో నుంచి ఒక వృద్ధురాలికి రూ.2,500 ముఖ్యమంత్రి అందచేయడంపై పెద్ద ఎత్తున హర్షం వ్యక్తమైంది.

Haryana CM Gives Rs 2500 to Elderly Woman

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News