Thursday, January 23, 2025

పోలీసు కస్టడీకి గోరక్షక నేత

- Advertisement -
- Advertisement -

నూహ్ : హర్యానాలో ఘర్షణలకు సంబంధించి అరెస్టు అయిన గో సంరక్షకులు బిట్టూ బజ్‌రంగ్‌ను పోలీసు కస్టడీకి పంపించారు. త్వరలోనే ఆయన సన్నిహితులను కూడా అరెస్టు చేస్తారని పోలీసులు బుధవారం తెలిపారు. ఫరీదాబాద్‌లో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. గత నెల 31న విహెచ్‌పి ర్యాలీ దశలో మతపరమైన ఘర్షణలు రాష్ట్రంలో వివిధ ప్రాంతాకు విస్తరించాయి. సంబంధింత ఘటనలపై బజ్‌రంగ్ ఇతరులపై పోలీసు స్టేషన్‌లో అసిస్టెంట్ ఎస్‌పి ఉషా కుందు దాఖలు చేసిన కేసు ప్రాతిపదికన అరెస్టు జరిగింది. పోలీసు కస్టడీలోకి తీసుకుని విచారించి మరిన్ని వివరాలు రాబడుతారని అధికార వర్గాలు తెలిపాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News