Thursday, November 14, 2024

హర్యానాలో ఈవిఎంల పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తిన దిగ్విజయ్ సింగ్

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ ఓటమి తర్వాత…

మధ్యప్రదేశ్ రాజ్యసభ సభ్యుడు దిగ్విజయ్ సింగ్ ప్రస్తుత ఎలెక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్(ఈవిఎంస్)పై అనుమానాలు వ్యక్తం చేశారు. అవి ఓటరు కిచ్చిన రాజ్యాంగ హక్కును కాలరాసాయన్నారు. హర్యానాలో బిజెపి విజయంతో కాంగ్రెస్ దిగ్భ్రాంతికి గురయింది. పోస్టల్ బ్యాలెట్ విషయానికి వచ్చినప్పుడు మధ్యప్రదేశ్ లో లాగే హర్యానాలో కూడా కాంగ్రెస్ గణనీయ సీట్లే గెలిచింది.

‘‘నేను ఓ ఓటరును. నా ఓటు నాకిష్టమైన అభ్యర్థికే వెళ్ళాలన్నది నా రాజ్యాంగ హక్కు. నేను నా బ్యాలెట్ పేపర్ ను స్వహస్తాలతో బ్యాలెట్ బాక్సులో వేస్తాను. అలాంటప్పుడు వేసిన ఓట్లు నూటికి నూరు శాతం లెక్కించబడాలి. ఇది నా రాజ్యాంగ హక్కు. కానీ దానిని ఈవిఎంల విధానం లాగేసుకుంటోంది’’ అని ఆయన శుక్రవారం విలేకరులతో అన్నారు. గతంలో కూడా ఈవిఎంల పనితీరుపై, విశ్వసనీయతపై అనేక ప్రశ్నలు తలెత్తాయని ఆయన అన్నారు.

హర్యానాలో పోస్టల్ బ్యాలెట్ లెక్కిపులో 90 సీట్లలో కాంగ్రెస్ పార్టీ 76 సీట్లు గెలిచింది. అయితే, ఈవిఎంల ఓట్ల లెక్కింపులో అది 37కు తగ్గిపోయింది అని ఆయన పేర్కొన్నారు. దేశంలో కుల గణన, సామాజిక ఆర్థిక సర్వే జరగాలని కూడా దిగ్విజయ్ సింగ్ ఈ సందర్భంగా కోరారు. దివంగత పారిశ్రామికవేత్త రతన్ టాటాకు ‘భారత్ రత్న’ అవార్డును ఇవ్వాలన్న విషయంలో ఆయన ఏకీభవించారు. ప్రస్తుత పార్లమెంటరీ రాజకీయాల్లో  ‘ఒకే దేశం, ఒకే ఎన్నిక’ అనేది అమలు చేయడం సాధ్యం కాదన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News