చండీగఢ్: ఎన్నికల కమిషన్ ప్రకారం హర్యానాలో ఓటింగ్ ముగిశాకే ఎగ్జిట్ పోల్ అంచనాలు వెలువడతాయి. హర్యానాలోని 90 సీట్లకు అక్టోబర్ 5న ఓటింగ్ జరుగనున్నది. హర్యానా, జమ్మూకశ్మీర్ ఎన్నికల ఫలితాలు అక్టోబర్ 8న ప్రకటించనున్నారు.
ఓట్ల లెక్కింపుకు ముందు వివిధ పోల్ స్టర్స్ విడుదల చేసే ఎగ్జిట్ పోల్ అంచనాల కోసం ఎదురుచూస్తారు. అయితే ఎన్నికల సంఘం అక్టోబర్ 5(శనివారం) సాయంత్రం 6.00 గంటల కంటే ముందే ఎగ్జిట్ పోల్ అంచనాలను టివి ఛానెళ్లు ప్రసారం చేయకూడదని సూచించింది. కనుక శనివారం సాయంత్రం 6.00 తర్వాత ఎగ్జిట్ పోల్ అంచనాలు వెలువడనున్నాయి. హర్యానాకు ఒకే దశ ఎన్నికలైతే, జమ్మూకశ్మీర్ లో మూడు దశల్లో ఎన్నిలు జరిగాయి. జమ్మూకశ్మీర్ ఎన్నికలు అక్టోబర్ 1న ముగిశాయి. ఇప్పుడు అంతా ఎగ్జిట్ పోల్ ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ఎవరైనా మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే వారికి జరిమానా, కారాగార శిక్ష పడే అవకాశం ఉంటుంది.