Sunday, December 22, 2024

లోన్ల పేరుతో మోసం..

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః రుణాలు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు తీసుకుని మోసం చేసిన హర్యానాకు చెందిన ముఠాను హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు అరెస్టు చేశారు. నలుగురిని అరెస్టు చేయగా,10మందికి నోటీసులు ఇచ్చారు. వారి వద్ద నుంచి 17 మొబైల్స్, ఏడు ల్యాప్‌టాప్‌లు, సిపియూను స్వాధీనం చేసుకున్నారు. సిసిఎస్ డిసిపి స్నేహమెహ్రా విలేకరుల సమావేశంలో శుక్రవారం వివరాలు వెల్లడించారు. హర్యానా, ఫరీదాబాద్‌కు చెందిన తరుణ్ ఓజా మ్యాజిక్ ట్రిప్ ఇండియా యజమాని, గురు చరణ్‌సింగ్, యోగేందర్ సింగ్ బడోరియా, షహదత్ అన్సారీని ప్రధాన నిందితులు. వీరిని పోలీసులు అరెస్టు చేశారు.

వీరి వద్ద పనిచేస్తున్న నవీన్ కుమార్, ప్రేమ్‌వీర్ సింగ్, జ్యోతికుమారి, జాన్వి తివారి, కంచన్, అన్యాదా, అమిత్ సింగ్ ఫట్యాల్, సౌమ్య, రీమా, మమత కుమారీకి నోటీసులు ఇచ్చారు. మ్యాజిక్ ట్రిప్ ఇండియాను ఏర్పాటు చేసిన నిందితులు టెలీకాలర్లుగా ఉద్యోగులను నియమించుకుని అమాయకులకు ఫోన్లు, మెసేజ్‌లు , మెయిల్స్ చేసి రుణాలు ఇప్పిస్తామని చెబుతున్నారు. తాము రిలయన్స్ క్యాపిటల్ ఫైనాన్స్ సర్వీసెస్ నుంచి మాట్లాడుతున్నామని రుణాలు ఇప్పిస్తామని, దానికి ఎలాంటి ఛార్జీలు తీసుకోమని చెబుతున్నారు. దీంతో చాలామంది ఎలాంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేవని భ్రమపడి వారికి వివరాలు చెబుతున్నారు.

తర్వాత వివిధ ఛార్జీల పేరు చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇలా దేశవ్యాప్తంగా చాలామంది వద్ద డబ్బులు తీసుకుని రుణాలు ఇప్పించకుండా మోసం చేస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన సీనియర్ సిటిజన్‌కు ఫోన్ చేసిన నిందితులు డబ్బులు తీసుకుని మోసం చేశారు. దీంతో బాధితుడు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేశారు. ఇన్స్‌స్పెక్టర్ హరిభూషన్, ఎస్సైలు సురేష్, శైలేందర్‌కుమార్, సిపిలు రవిశంకర్, రాము, మనీష్‌కుమార్ తివారీ, సాయికుమార్ తదితరులు పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News