- Advertisement -
టోక్యో ఒలింపిక్స్ లో రజత పతక సాధించిన రవికుమార్ దహియాకు అతని సొంత రాష్ట్రం హర్యానా ప్రభుత్వం భారీ నజరానాలు ప్రకటించింది. రవికుమార్‌కు రూ.4 కోట్ల నగదు బహుమతి, క్లాస్ 1 కేటగిరిలో ఉద్యోగం ఇస్తున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. అంతేగాక ఏ ప్రాంతంలో అయినా రవికి 50 శాతం రాయితీతో ప్లాట్‌ను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే రవి స్వగ్రామం నాహ్రీలో రెజ్లింగ్ శిక్షణ కోస ఇండోర్ స్టేడియం నిర్మించనున్నట్టు హర్యానా ప్రభుత్వం తెలిపింది.
Haryana Govt announces rs 4 cr prize for Ravi Dahiya
- Advertisement -