Thursday, January 23, 2025

పెళ్లికాని పెద్దలకు పింఛన్..

- Advertisement -
- Advertisement -

చండీగఢ్ : వయస్సు మీదబడ్డా ఏదో కారణంతో పెళ్లికాని వారికి నెలవారి పింఛన్ ఇవ్వనున్నట్లు హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ కట్టర్ తెలిపారు. తమ ప్రభుత్వం దీనిపై కసరత్తు చేస్తోందని, త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. 45 నుంచి 60 ఏండ్లలోపు వరకూ ఉన్న ఈ అవివాహితులకు ఈ పెన్షన్ పథకం త్వరలోనే అమలులోకి రానుందని సూచనప్రాయంగా తెలిపారు. ఇక ఇప్పుడు రాష్ట్రంలో వయోవృద్ధులకు ఇచ్చే నెలవారి పింఛన్‌ను వచ్చే ఆరు నెలల్లోపు రూ 3000గా ఖరారు చేస్తామన్నారు.

అవివాహితులకు పించన్ విషయంలో ఓ నెలరోజుల్లో నిర్ణయం తీసుకుంటామని కర్నాల్ జిల్లాలోని కలాంపురా గ్రామంలో జరిగిన జన్‌సంవాద్ కార్యక్రమంలో ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తనకు ఓ 60 ఏండ్ల వ్యక్తి నుంచి అందిన వినతిపత్రంపై ముఖ్యమంత్రి స్పందించారు. తనకు పెళ్లికాలేదని, దిక్కుతోచని స్థితిలో ఉన్నానని తనకు పెన్షన్ కల్పించాల్సి ఉందని ఈ వ్యక్తి కోరారు. దీనిపై సిఎం స్పందిస్తూ రాష్ట్రంలోని ఇటువంటి వారికి త్వరలో సాయం అందించేందుకు తగు పథకం రూపొందించేందుకు నిర్ణయించినట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News