Thursday, December 19, 2024

రైలులో పరిచయమైన ప్రియురాలు కోసం భార్యను ముక్కలు ముక్కలుగా నరికి….

- Advertisement -
- Advertisement -

ఛండీగఢ్: రైలులో పరిచయం కావడంతో వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం భార్యకు తెలియడంతో ఆమెను గొంతు కోసి చంపేసి తల, చేతులు, కాళ్లు నరికేసి వేర్వేరు ప్రాంతాల్లో పడేసి అనంతరం మొండాన్ని తగలబెట్టిన సంఘటన హర్యానాలోని గురుగ్రామ్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. గురుగ్రామ్ ముఖేశ్-సోనియా అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు ఓ చిన్నారి ఉంది. 2018లో ముఖేష్ బిహార్ నుంచి హర్యానాకు వస్తుండగా ఓ మహిళ పరిచయమైంది.

Also Read: చిల్లర వాపసు అడిగితే చితకబాదిన మహిళా కండక్టర్

పరిచయం ప్రేమగా మారడంతో ఇద్దరు మధ్య అక్రమ సంబంధం ఏర్పడింది. సదరు మహిళకు ఓ పాప జన్మించడంతో తరుచూ బిహార్‌కు వెళ్లి వస్తుండేవాడు. భర్తపై సోనియాకు అనుమానం కలగడంతో పలుమార్లు గొడవలు జరిగాయి. భార్య ఉండగా తన ప్రియురాలును కలుసుకోవడం కుదరదని ఆమెను చంపాలని నిర్ణయం తీసుకున్నాడు. ఏప్రిల్ 21న బాత్రూమ్‌లో భార్య గొంతు కోసి హత్య చేశాడు. కాళ్లు, చేతులు, తలను వేరే చేసి వివిధ ప్రదేశాల్లో పడేశాడు. మొండాన్ని నిర్మానుష్య ప్రదేశంలో పడేసి తగలబెట్టాడు. తన భార్య కనిపించడంలేదని స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి భర్తపై అనుమానం రావడంతో అతడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా తానే హత్య చేశానని ఒప్పుకున్నాడు. వెంటనే అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News