Thursday, January 23, 2025

భార్యను భర్త ముక్కలు ముక్కలు నరికి… తగలబెట్టాడు

- Advertisement -
- Advertisement -

ఛండీగఢ్: భార్యను భర్త ముక్కలు ముక్కలుగా నరికి అనంతరం తల లేని మొండాన్ని తగలబెట్టిన సంఘటన హర్యానా రాష్ట్రం గురుగ్రామ్‌లోని మనేసార్‌లోజరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. గాంధీనగర్‌కు చెందిన జితేందర్ అనే వ్యక్తి కుక్‌డోలా గ్రామంలో నివసిస్తున్నాడు. కుక్‌డోలా గ్రామ శివారులోని తన పొలంలో సగం కాలిన మొండెం కనిపించడంతో పోలీసులకు ఉమద్ సింగ్ సమాచారం ఇచ్చాడు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా జితేందర్‌ను అదుపులోకి తీసుకున్నారు. తన భార్యను తానే చంపానని ఒప్పుకున్నాడు. మొండెంతో పాటు కాళ్లు, చేతులు, తల వేర్వేరు ప్రదేశాలలో ఉన్న వాటిని పోలీసులు స్వాధీనం చేసుకొని శవ పరీక్ష నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. భార్యను భర్త ఎందుకు చంపాల్సి ఉంది అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: 40 మంది భార్యలకు భర్త ఒక్కడే కానీ…

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News