Thursday, January 23, 2025

ప్రైవేట్ ఉద్యోగాల్లో 75శాతం రిజర్వేషన్‌కు బ్రేక్..

- Advertisement -
- Advertisement -

Haryana HC stay on law provide 75% reservation

న్యూఢిల్లీ: ప్రైవేట్ ఉద్యోగాల్లో స్థానికులకు 75 శాతం రిజర్వేషన్ కల్పించేలా హర్యానా ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన చట్టానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది. ప్రస్తుతం ఈ నిర్ణయాన్ని నిలుపుదల చేస్తున్నట్టు హర్యానా, పంజాబ్ ఉమ్మడి హైకోర్టు వెల్లడించింది. అంతేకాకుండా దీనిపై ఆ రాష్ట్రప్రభుత్వం నుంచి వివరణ కోరింది. స్థానికులకు 75 శాతం కోటాపై హర్యానా ప్రభుత్వ నిర్ణయాన్నివ్యతిరేకిస్తూ ఫరీదాబాద్ ఇండస్ట్రీస్ అసోసియేషన్‌తోపాటు పలువురు దాఖలు చేసిన పిటిషన్లను విచారించిన న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే హైకోర్టు నిర్ణయంపై హర్యానా డిప్యూటీ ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా స్పందించారు. రాష్ట్ర యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రైవేట్ రంగం ఉద్యోగాల్లో స్థానికులకే 75 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ మనోహర్‌లాల్ ఖట్టర్ ప్రభుత్వం గత ఏడాది నూతన చట్టాన్ని తీసుకువచ్చింది. అయితే దీనిపై ప్రైవేట్ రంగం పారిశ్రామిక వేత్తల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.
నిరుద్యోగంలో హర్యాణా టాప్
కొవిడ్ కారణంగా ప్రతికూల పరిస్థితులతో దేశంలోనిరుద్యోగిత విపరీతంగా పెరిగినట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయితే ప్రస్తుతం కొవిడ్ తీవ్రత తగ్గుముఖం పట్టడంతో దేశంలో నిరుద్యోగిత రేటు కాస్త తగ్గుముఖం పడుతోందని సెంటర్ ఫర్ మోనిటరింగ్ ఇండియన్ ఎకానమీ పేర్కొంది. ప్రస్తుతం దేశంలో నిరుద్యోగిత రేటు 6.57 శాతం ఉండగా, రాజస్థాన్‌లో 18.9 శాతం ఉందని తెలిపింది. అత్యల్ప నిరుద్యోగం రేటు తెలంగాణలో 0.7 శాతంగా నమోదు కాగా, గుజరాత్ (1.2 శాతం), మేఘాలయ (1.5 శాతం), ఒడిశా (1.8 శాతం), తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

Haryana HC stay on law provide 75% reservation

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News