Monday, December 23, 2024

కుక్కకాటుకు పరిహారం దెబ్బ… పంటిగాటుకు రూ.10వేలు ఇవ్వాల్సిందే

- Advertisement -
- Advertisement -

వీధి కుక్కల దాడికి ఎందరో చిన్నారులు బలి కావడం చూస్తూనే ఉన్నాం. అయినా వాటి ఆట కట్టించడంలో ప్రభుత్వాలు విఫలమవుతూనే ఉన్నాయి. పంజాబ్-హర్యానా హైకోర్టు తాజాగా వెలువరించిన తీర్పుతో ఈ దిశగా ముందడుగు పడుతుందని ఆశించవచ్చు.

అన్ని రాష్ట్రాలలో మాదిరిగా పంజాబ్-హర్యానాల్లోనూ వీధి కుక్కల బెడద ఎక్కువే. వీధి కుక్కల బారి నుంచి కాపాడాలంటూ కోర్టులో 193 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిని విచారించిన హైకోర్టు మంగళవారం సంచలనాత్మకమైన తీర్పునిచ్చింది. వీధి కుక్కల దాడిలో గాయపడిన బాధితులకు పరిహారం అందిచాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని స్పష్టం చేసింది.

ఎవరైనా కుక్క కాటుకు గురయితే, ఒక్కొక్క పంటిగాటుకి కనీసం పదివేల రూపాయలు చెల్లించాలని, ఆ గాయం మరింత లోతుగా ఉంటే, రూ. 20 వేలు పరిహారంగా అందించాలని హైకోర్టు తీర్పు చెప్పింది. కుక్కలే కాకుండా వీధుల్లో తిరిగే గాడిదలు, గేదెలు, పెంపుడు జంతువుల దాడుల్లో చెల్లించవలసిన పరిహారాన్ని నిర్ణయించేందుకు ఓ కమిటీని నియమించాలని అధికారులను హైకోర్టు ఆదేశించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News