Monday, December 23, 2024

భార్యను, బావమరదులను కాల్చి చంపిన కిరాతకం..

- Advertisement -
- Advertisement -

హిసార్: భార్యాభర్తల మధ్య గొడవలు చివరకు తుపాకీ కాల్పులకు దారి తీసి మూడు నిండు ప్రాణాలను బలిగొన్నాయి. క్రిష్ణానగర్‌కు చెందిన రాకేష్ తన భార్య సుమన్‌తో ఏదో ఒక విషయమై తరచుగా గొడవ పడుతుండేవాడు. ఆదివారం కూడా వీరి మధ్య తగవు తీర్చడానికి బావమరుదులు సమీపాన గల ధనానా గ్రామం నుంచి వచ్చారు. వారి మధ్య మాటామాటా పెరగడంతో నిందితుడు రాకేష్ తన లైసెన్స్‌డ్ రివాల్వర్‌తో కాల్పులు జరపడంతో భార్య సుమన్, బావమరదులు మంజీత్ సింగ్, ముఖేష్ కుమార్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారని ఎస్‌పి గంగారామ్ పుణియా చెప్పారు. ఎస్‌పి, పోలీస్‌లు సంఘటన ప్రదేశంలో తూటాలను కనుగొన్నారు. ఫోరెన్సిక్ బృందం సాక్షాధారాలు సేకరించింది. పరారీలో ఉన్న రాకేష్‌ను త్వరలో పట్టుకుంటామని ఎస్‌పి చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News