Wednesday, January 22, 2025

హర్యానాను వీడని విద్వేషం..

- Advertisement -
- Advertisement -

గురుగ్రామ్ : హర్యానాలోని నూహ్ జిల్లాలో ఓ వర్గానికి చెందిన ప్రార్థనా స్థలాన్ని దుండగులు తగులబెట్టారు. మరోటి షార్ట్‌సర్యూట్‌తో మంటలు చెలరేగాయి. ఈ ప్రాంతం గత కొద్దిరోజులుగా ఘర్షణలతో అట్టుడుకుతోంది. ఈ రెండు ప్రార్థనా స్థలాలలో బుధవారం మధ్యాహ్నం జరిగిన ఘటనల గురించి పోలీసులు వివరించారు. ఘటనలలో ఎవరూ గాయపడలేదు. అయితే ఆస్తినష్టంజరిగింది. దుండగులు తగులబెట్టిన ప్రార్థనాస్థలం విజయ్‌చౌక్ వద్ద ఉంది. ఓ చోట స్వల్ప విధ్వంసానికి పాల్పడ్డారని, మరోచోట జరిగిన అగ్ని ప్రమాదానికి విద్యుత్ షార్ట్‌సర్కూట్ కారణం అని భావిస్తున్నామని నూహ్ జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీసు (ఎస్‌పి) వరుణ్ సింగ్ తెలిపారు. పరిస్థితిని పోలీసులు అదుపులోకి తెచ్చుకున్నట్లు, దుండగుల కోసం గాలిస్తున్నట్లు వివరించారు. సమీప ప్రాంతాల్లో అమర్చి ఉన్న సిసిటీవీ కెమెరాల ద్వారా నిప్పుపెట్టిన దుండగులను గుర్తించేందుకు వీలుంది.

ఈ రెండు ప్రార్థనా స్థలాలపై దుండగులు ముందుగా మోలోటోవ్ కాక్‌టైల్ బాటిల్స్ విసిరినట్లు గుర్తించారు. నూహ్‌లో కర్ఫూను సడలించారు. ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకూ ఆంక్షలు ఎత్తివేశారు. ఈ సమయంలోనే ప్రజలు నిత్యావసర సరుకులు కొనుక్కోవల్సి ఉంటుంది. నూహ్ జిల్లా కేంద్రపట్టణంలో సోమవారం మత ఘర్షణలు చోటుచేసుకున్నాయి. విహెచ్‌పి తలపెట్టిన ఓ ప్రదర్శనను నిలిపివేసేందుకు ఓ గుంపు యత్నించడంతో ఘర్షణలు జరిగాయి. అల్లరిమూకల దాడిలో ఓ మతగురువు చనిపొయ్యారు. దుండగులు ఆ ప్రాంతంలోని టిఫిన్ సెంటర్‌ను, కొన్ని దుకాణాలను ధ్వంసం చేశారు. మరుసటి రోజు మంగళవారం సమీప ప్రాంతాలైన గురుగ్రామ్‌కు కూడా మతపరమైన హింసాకాండ వ్యాపించింది. ఇప్పటివరకూ హింసాత్మక ఘటనలలో ఆరుగురు మృతి చెందారు. అల్లర్లకు సంబంధించి ఇప్పటివరకూ 116 మందిని అరెస్టు చేశారు. అల్లర్లు వ్యాపించకుండా ఉండేందుకు హర్యానా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకొంటోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News