Thursday, December 19, 2024

కుటుంబ సభ్యులను తాళ్లతో కట్టేసి… ముగ్గురు మహిళలపై గ్యాంగ్ రేప్?

- Advertisement -
- Advertisement -

ఛండీగఢ్: నలుగురు దుండగులు ఇంట్లోకి చొరబడి కుటుంబ సభ్యులను తాళ్లతో కట్టేసి అనంతరం ముగ్గురు మహిళలపై సామూహిక అత్యాచారం చేసినట్టు ఆరోపణలు రావడంతో పాటు అదే గ్రామంలో మరో ఇంట్లో దంపతులపై దాడి చేసి నగదు, ఆభరణాలు ఎత్తుకెళ్లిన సంఘటన హర్యానా రాష్ట్రం పాణిపట్టులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. బుధవారం రాత్రి సమయంలో నలుగురు దుండగులు కత్తులు, పదునైన ఆయుధాలతో ఇంట్లోకి చొరబడి వారిపై దాడి చేసి తాళ్లతో కట్టేసి ముగ్గురు మహిళలపై సామూహిక అత్యాచారం చేశారు. అనంతరం నగదు, ఆభరణాలను ఎత్తుకెళ్లారు. అదే గ్రామంలో మరో ఇంట్లోకి చొరబడి దంపతులపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం ఇంట్లో నగదు, బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. దంపతులు తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. భార్య పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రెండు ఘటనలు నలుగురు దుండగులే చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దు..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News