Thursday, April 24, 2025

హర్యానాలో కొనసాగుతున్న పోలింగ్

- Advertisement -
- Advertisement -

చండీగఢ్: హర్యానా అసెంబ్లీ ఎన్నికలు 2024 నేడు కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం వరకు 41 శాతం పోలింగ్ జరిగింది. బిజెపి నాయకుడు, ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ కాంగ్రెస్ అబద్ధం, లూట్ రాజకీయంకు పాల్పడుతోందని నిందించారు. కాగా తమ పార్టీయే ఎన్నికల్లో గెలువబోతుందని కాంగ్రెస్ నాయకుడు భూపేందర్ సింగ్ హుడా ధీమా వ్యక్తం చేశారు. మాజీ ఉపముఖ్యమంత్రి దుష్యంత్ సింగ్ చౌతాలా సైతం తమ కూటమి గెలుస్తుందని అన్నారు. ఇదిలావుండగా హిసార్ లోని  నార్నౌద్ పోలింగ్ బూత్ బయట బిజెపి, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య బాహాబాహి జరిగిందని సమాచారం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News