Sunday, January 19, 2025

పాఠశాలకు వెళ్తుండగా బాలిక కిడ్నాప్… హోటల్ లో అత్యాచారం

- Advertisement -
- Advertisement -

ఛండీగఢ్: 15 ఏళ్ల బాలిక పాఠశాలకు వెళ్తుండగా కిడ్నాప్ చేసి ఆమెపై అత్యాచారం చేసిన సంఘటన హర్యానా రాష్ట్రం రోహతక్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… 15 ఏళ్ల బాలిక తన ఇంటి నుంచి స్కూల్‌కు వెళ్తుండగా తెలిసిన వ్యక్తి కారులో వచ్చి ఆమెను అడ్డగించాడు. బాలికను కిడ్నాప్ చేసి హోటల్‌కు తీసుకెళ్లారు. ఆమెపై అత్యాచారం చేశారు. బాలికను వాళ్లు బెదిరించడంతో తప్పించుకొని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చింది. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు నిందితులలో ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నాలుగో వ్యక్తి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కాంగ్రెస్ నేత, హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా ఈ ఘటనలో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ స్థానిక ఎంఎల్‌ఎ బిబి బాత్రాకు ఫోన్ చేసి బాధితులను ఆదుకోవాలని సూచించారు. హర్యానాలో ప్రతి రోజు నాలుగు నుంచి ఐదు అత్యాచారం కేసులు నమోదు కావడంతో పాటు కిడ్నాపులు డజన్లలో ఉంటున్నాయని నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో తెలిపింది.

Also read: భక్తురాలిపై కారులో గ్యాంగ్ రేప్…..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News