Sunday, December 22, 2024

బాలికలపై పాఠశాల ప్రిన్సిపాల్ లైంగిక వేధింపులు

- Advertisement -
- Advertisement -

బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడి, పరారీలో ఉన్న ఓ ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ ను పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. హర్యానాలోని జిండ్ జిల్లాలో ఓ పాఠశాల ప్రిన్సిపాల్ తమను వేధింపులకు గురి చేస్తున్నట్లు అదే  పాఠశాలకు చెందిన 50 మందికి పైగా బాలికలు హర్యానా రాష్ట్ర మహిళా కమిషన్ కు మొరపెట్టుకున్నారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఐదు రోజులుగా పరారీలో ఉన్న ప్రిన్సిపాల్ ను అరెస్టు చేశామని డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్ అమిత్  కుమార్ భాటియా చెప్పారు. ఈ కేసుపై ఐదుగురు సభ్యులతో కూడిన పోలీసు బృందం విచారణ జరుపుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News