Wednesday, January 29, 2025

ప్రియురాలిని కత్తితో పొడిచి చంపి…. ఇల్లును తగలబెట్టిన ప్రియుడు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ప్రియురాలిని కత్తులతో పొడిచి చంపి అనంతరం ఆమె ఇంటిని తగలబెట్టిన సంఘటన హర్యానాలోని సోనిపట్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. సరితా అనే మహిళ 2004లో తన భర్తతో విడాకులు తీసుకొని తన కూతురుతో కలిసి ఒంటరిగా ఉంటుంది. సరిత పంజాబ్‌లోని జిరాక్‌పూర్‌లో ఓ ప్రైవేట్ కాలేజీలో లెక్చర్‌గా పని చేస్తుంది. గత ఆరు సంవత్సరాల క్రితం స్కూల్లో చదివిన స్నేహితుడు ఉప్కార్ పరిచయం కావడంతో అతడితో సహజీవనం చేస్తుంది. స్కూళ్లో ఉన్నప్పుడు ఇద్దరు మధ్య ప్రేమ చిగురించింది.

ఇద్దరు మధ్య గత కొన్ని రోజుల నుంచి డబ్బుల విషయంలో గొడవలు జరుగుతుండడంతో సరిత ఇంట్లోనే ఆమెను ఉప్కార్ పొడిచి చంపాడు. అనంతరం ఇంటిని తగలబెట్టాడు. ఇల్లు తగలబడడంతో ఆమె సోదరుడు ట్రిష్లకు ఇరుగుపొరుగు వారు సమాచారం. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక విచారణలో ఆమె మంటల్లో కాలిపోయిందని పోలీసులు భావించారు. శవపరీక్షలో మాత్రం ఆమెను పొడిచి చంపారని తెలిసింది. ట్రిష్ల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఉప్కార్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News