Monday, December 23, 2024

శ్రీలంకకు షాక్.. గాయంతో వరల్డ్ కప్‌కు హసరంగా దూరం?

- Advertisement -
- Advertisement -

కొలొంబో: వరల్డ్ కప్ మెగా సంగ్రామం ముందు శ్రీలంక జట్టుకు భారీ దెబ్బ తగిలింది. ఆ జట్టులో కీలక ఆటగాడు గాయాలతో టోర్నీకి దూరమవనున్నట్లు తెలుస్తోంది. శ్రీలంక ప్రధాన బౌలర్ వనిండు హాసరంగా గాయంతో చికిత్స తీసుకుంటున్నాడు. దీనిపై ఆ జట్టు మెడికల్ ప్యానెల్ హెడ్ అర్జున డి సిల్వా స్పందించాడు.

హసరంగ గాయం తీవ్రతరం కావడంతో ఈ టోర్నికి దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అతనికి శస్త్ర చికిత్స కోసం విదేశాల నుంచి వైద్యులను సంప్రదిస్తున్నామని, చికిత్స అనంతరం హసరంగకు మూడు నెలల విశ్రాంతి అవసరముంటుందని, దీంతో టోర్ని మొత్తానికి అతడు దూరం కావొచ్చనే అనుమానం వ్యక్తం చేశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News