Sunday, January 19, 2025

హాష్ ఆయిల్ ముఠా అరెస్ట్

- Advertisement -
- Advertisement -

2.5కిలోల హాష్ ఆయిల్, కారు స్వాధీనం
వినియోగదారుల్లో డాక్టర్లు, వైద్య విద్యార్థులు, ఐటి ఉద్యోగులు
వివరాలు వెల్లడించిన నార్కొటిక్ డిసిపి చక్రవర్తి గుమ్మి

హైదరాబాద్: హాష్ ఆయిల్ రవాణా చేస్తున్న ముఠాను హైదరాబాద్ నార్కోటిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్(హెచ్ న్యూ) పోలీసులు అరెస్టు చేశారు. ఐదుగురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు వారి వద్ద నుంచి 2.5కిలోల హాష్ ఆయిల్, కారు, ఐదు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. హెచ్‌న్యూ డిసిపి చక్రవర్తి గుమ్మి హైదరాబాద్ కమిషనరేట్ పాత కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. పిలోని అల్లూరిసీతారామరాజు జిల్లా, చింతపల్లి మండలం, గొప్పుగుడిసెలు గ్రామానికి చెందిన గొమ్మెళ్లి బండు, కాపు చందర్ హాష్ ఆయిల్‌ను సప్లయ్ చేస్తున్నారు.

నగరానికి చెందిన ఎప్పలపల్లి సంతోష్ రెడ్డి హాష్ ఆయిల్‌ను కొనుగోలు చేస్తున్నాడు. సంతోష్‌పై సరూర్‌నగర్, కాచిగూడ పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నాయి. ఇతడి వద్ద హాష్ ఆయిల్‌ను నానేని సాయిభరత్, ఓరుగంటి హరితేజ కోనుగోలు చేస్తున్నారు. సంతోష్ 2018 నుంచి హాష్ ఆయిల్‌ను తయారు చేస్తున్న విశాఖపట్టనం ఏజెన్సీ వారితో సంబంధాలు పెట్టుకున్నాడు. వారి వద్ద లీటర్‌కు రూ.80,000 చెల్లించి కొనుగోలు చేస్తున్నాడు.

తర్వాత ఆయిల్‌ను 200 చిన్న బాటిళ్లలో 5ఎంఎల్ చొప్పున నింపి అవసరం ఉన్న వారికి విక్రయిస్తున్నాడు. ఒక బాటిల్‌కు వినియోగదారుల వద్ద నుంచి రూ.2,000 తీసుకుంటున్నాడు. ఇప్పటి వరకు సంతోష్ వద్ద హాష్ ఆయిల్‌ను కొనుగోలు చేసిన 11మందిని గుర్తించారు. వారిలో డాక్డర్లు, వైద్య విద్యార్థులు, ఐటి ఉద్యోగులు ఉన్నారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్స్‌స్పెక్టర్ రమేష్ రెడ్డి, ఎస్సై వెంకటరాములు తదితరులు పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News