Monday, December 23, 2024

సంచలనంగా మారిన షమీ మాజీ భార్య వీడియో

- Advertisement -
- Advertisement -

మహమ్మద్ షమీ మాజీ భార్య హసీన్ జహా తాజాగా ఇన్ స్ట్రా గ్రామ్ లో చేసిన పెట్టిన ఓ వీడియో ఇప్పుడు సంచలనంగా మారింది. ప్రపంచ కప్ ఫైనల్లో టీమిండియా ఓడిపోయిన నేపథ్యంలో, ఫైనల్ మ్యాచ్ ఫలితంపై హసీన్ జహా ఓ వీడియో విడుదల చేశారు. ఆమె అంతరార్థం సరిగా తెలియకపోయినా, నెటిజన్లు మాత్రం ఆమెపై విమర్శలతో విరుచుకుపడుతున్నారు.

ఇంతకూ ఆ వీడియోలో ఏముందంటే, హసీన్ జహా కెమెరావైపు చూస్తూ ఉంటే, నేపథ్యంలో ఓ గొంతు ‘చివరకు మంచివాళ్లే గెలుస్తారు’ అనడం వినిపిస్తుంది. ఇందులో ఆమె ఉద్దేశం ఏమిటో మిస్టరీగా ఉంది. షమీని ఉద్దేశించే ఈ వీడియో చేశారా లేక టీమిండియాకు ధైర్యం చెబుతూ విడుదల చేశారా అనేది తెలియడం లేదు.

కానీ అభిమానులు మాత్రం రకరకాల కామెంట్లు పెడుతున్నారు. ఓ నెటిజన్ ‘ మీ మాటలను బట్టి ఆస్ట్రేలియా ఆటగాళ్లే మంచివాళ్లని అంటున్నట్టు ఉంది’ అని అంటే, మరొక నెటిజన్ ‘టీమిండియా ఆటగాళ్లు మంచివాళ్లు కారా?’ అని అడిగాడు.

టీమిండియా పరాజయం పాలైన రోజు ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్లి ఆటగాళ్లను ఓదార్చిన విషయం తెలిసిందే. మహ్మద్ షమీని ఆయన దగ్గరకు తీసుకుని మరీ ఓదార్చారు.

షమీ-హసీన్ జహా విడిపోయిన సంగతి తెలిసిందే. ఈ జంట కోర్టును ఆశ్రయించి, విడాకులు తీసుకుంది. హసీన్ కు భరణంగా ప్రతి నెల లక్షా 30 వేల రూపాయలు చెల్లించాలంటూ కోర్టు షమీని ఆదేశించింది.

https://www.instagram.com/hasinjahanofficial/?utm_source=ig_embed&ig_rid=f3901d3b-db21-4fb4-bf00-da18857d8598

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News