Monday, January 27, 2025

‘పురుషోత్తముడు’లో బబ్లీ గర్ల్‌గా అలరిస్తా :హాసినీ సుధీర్

- Advertisement -
- Advertisement -

రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘పురుషోత్తముడు‘. ఈ చిత్రాన్ని శ్రీ శ్రీదేవి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై డా.రమేష్ తేజావత్, ప్రకాష్ తేజావత్ ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో హాసిని సుధీర్ హీరోయిన్‌గా పరిచయమవుతు న్నారు. ‘ఆకతాయి‘, ‘హమ్ తుమ్‘ చిత్రాలతో ప్రతిభావంతమైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రామ్ భీమన ‘పురుషోత్తముడు’ సినిమాను రూపొందిస్తున్నారు. ప్రకాష్ రాజ్, మురళి శర్మ, రమ్య కృష్ణ, బ్రహ్మానందం, ముకేష్ ఖన్నా వంటి స్టార్ కాస్టింగ్ తో రూపొందిన ఈ సినిమా శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ సందర్భంగా సినిమా హీరోయిన్ హాసినీ సుధీర్ మీడియాతో ముచ్చటిస్తూ చెప్పిన విశేషాలు..

బబ్లీ గర్ల్‌గా కనిపిస్తా…
– పురుషోత్తముడు చిత్రంలో నేను అమ్ములు అనే క్యారెక్టర్ చేశాను. అంతా అమ్ము అని పిలుస్తారు. తనొక బబ్లీ గర్ల్. అందరితో పని చేయిస్తుంటుంది. హీరోతో కూడా పని చేయిస్తుంది. ఈ క్యారెక్టర్ లో నటించడాన్ని ఎంజాయ్ చేశాను.
అదృష్టంగా భావిస్తున్నా…
-రాజ్ తరుణ్‌తో కలిసి నటించడం హ్యాపీగా ఉంది. సెట్స్ లో తను ఎంతో సపోర్ట్ అందించేవారు. మా డైరెక్టర్ రామ్ భీమనకి థ్యాంక్స్ చెబుతున్నా. మా ప్రొడ్యూసర్స్ మమ్మల్ని అందరినీ ఒక ఫ్యామిలీ మెంబర్స్‌లా చూసుకున్నారు. – నా మొదటి చిత్రంలోనే చాలా మంది పెద్ద ఆర్టిస్టులతో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నా. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ లాంటి స్టార్స్ కళ్లతోనే నటిస్తారు. నేనూ అలా నటించాలని అనుకునేదాన్ని.

హోల్‌సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్…
– పురుషోత్తముడు సినిమా పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. అందరూ కుటుంబంతో వెళ్లి చూడండి. ఈ సినిమాను నేను ఒక ప్రేక్షకురాలిగా చూసినప్పుడు హోల్‌సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అనే ఫీల్ కలిగింది.

యాక్షన్ మూవీస్ చేయాలని ఉంది…
-తెలుగు సినిమాల్లో హీరోయిన్స్‌ను అందంగా చూపిస్తారు. అందుకే నాకు తెలుగు సినిమాలంటే ఇష్టం. -నాకు లవ్ స్టోరీస్ తో పాటు యాక్షన్ మూవీస్ కూడా చేయాలని ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News