Monday, December 23, 2024

విద్యుదీకరణతో హసన్పర్తి రోడ్డు

- Advertisement -
- Advertisement -

ఉప్పల్ మధ్య మూడో లైన్ ప్రారంభం
అభినందించిన దమ. రైల్వే జిఎం అరుణ్ కుమార్ జైన్

మన తెలంగాణ / హైదరాబాద్ : కాజీపేట – బల్హర్షా విద్యుదీకరణ ప్రాజెక్టులో భాగంగా దక్షిణ మధ్య రైల్వే హసన్‌పర్తి రోడ్ , ఉప్పల్ మధ్య 12.7 కిలోమీటర్ల దూరం విద్యుద్దీకరణతో పాటు మూడవ లైన్ పనులు కూడా పూర్తి చేసి ప్రారంభించింది. కాజీపేట – బల్హర్షా మధ్య ఉన్న సెక్షన్ గ్రాండ్ ట్రంక్ రూట్లో దేశంలోని దక్షిణ ప్రాంతంతో కలుపుతూ ఉన్న ఓ కీలకమైన రైలు మార్గంగా చెప్పవచ్చు. దక్షిణ మధ్య రైల్వే లో కాజీపేట – బల్హర్షా మధ్య సెక్షన్ తెలంగాణ మహారాష్ట్ర రెండు రాష్ట్రాల పరిధిలోకి వస్తుంది. గ్రాండ్ ట్రంక్ రూట్లో ఉన్న ఈ మెయిన్ లైన్ ప్యాసింజర్ సరకు రవాణా రెండింటిలో నిరంతర వృద్ధిని సాధిస్తోంది. ఈ కీలక విభాగాన్ని రద్దీని తగ్గించడానికి, 2016లో రాఘవపురం – మందమర్రి మధ్య 33 కిలో మీటర్ల దూరం ట్రిపుల్ పనులు పూర్తయ్యాయి. కాజీపేట – బల్హర్షా సెక్షన్‌లోని మిగిలిన ట్రిప్లింగ్ , విద్యుద్దీకరణ పనులను మరింత సులభతరం చేయడానికి. 2015 -16 సంవత్సరంలో 202 కి.మీ (తెలంగాణ-159 కి.మీ, మహారాష్ట్ర-43 కి.మీ) దూరం రూ. 2,063 కోట్ల అంచనా వ్యయంతో మంజూరు అయింది. అందులో భాగంగా ఉప్పల్ – రాఘవాపురం మధ్య 59 కిలోమీటర్లు, సిర్పూర్ కాగజ్ నగర్ – మాణిక్ఘర్ మధ్య 60 కిలోమీటర్ల మేర పనులు ఇప్పటికే పూర్తయ్యాయి.

ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోని 159 కిలో మీటర్ల పరిధిలో హన్మకొండ, వరంగల్ జిల్లాల పరిధిలో 12.7 కిలోమీటర్ల మేర హసన్‌పర్తి ఉప్పల్ మధ్య మూడో లైన్ పనులు పూర్తవడం ద్వారా ఈ ప్రాంత సామాజిక -ఆర్థిక అభివృద్ధికి ఊతమిస్తున్నాయి. ఈ మూడో లైన్ను ప్రారంభించడం వల్ల ఈ గ్రాండ్ ట్రంక్ రూట్లో సరుకు రవాణా ప్యాసింజర్ రైళ్లకు రద్దీ మరింత తగ్గుతుంది. కాగా బ్యాలెన్స్ పనులు ఇక వేగంగా జరుగుతున్నాయి.ఈ సందర్బంగా దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ మాట్లాడుతూ హసన్‌పర్తి ఉప్పల్ మధ్య ట్రిప్లింగ్ , విద్యుద్దీకరణ పనులను పూర్తి చేసిన సికింద్రాబాద్ డివిజన్ , నిర్మాణ సంస్థ సిబ్బందని అభినందించారు. కాజీపేట- బల్హర్షా ట్రిప్లింగ్ ప్రాజెక్ట్ పూర్తి చేయడం వల్ల ఈ ఓవర్ శాచురేటెడ్ రూట్లో రద్దీ తగ్గుతుందని సరుకు రవాణా ప్యాసింజర్ రైళ్లను సమర్థవంతంగా నిర్వహించడం సులభతరం అవుతుందని ఆయన పేర్కొన్నారు.

Hassanparti Road with electrification

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News