Monday, December 23, 2024

టీమిండియా క్లీన్ స్వీప్

- Advertisement -
- Advertisement -

Hat-trick win for India against Zimbabwe

గిల్ శతకం, సికందర్ సెంచరీ వృథా, జింబాబ్వేపై భారత్ హ్యాట్రిక్ విజయం

హరారే: జింబాబ్వేతో జరిగిన మూడో, చివరి వన్డేలో టీమిండియా 13 పరుగుల తేడాతో చెమటోడ్చి విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ 30తో సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసింది. శుభ్‌మన్ గిల్ (130) అద్భుత సెంచరీతో అలరించాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే 49.3 ఓవర్లలో 276 పరుగులకు ఆలౌటైంది. సికందర్ రజా చిరస్మరణీయ సెంచరీతో కదంతొక్కడంతో జింబాబ్వే చివరి వరకు పోరాడి ఓడింది. క్లిష్టమైన లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వేకు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ ఇన్నొసెంట్ కయా (6)ను దీపక్ చాహర్ వెనక్కి పంపాడు. అయితే మరో ఓపెనర్ సీన్ విలియమ్స్ భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరును ముందుకు తీసుకెళ్లాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన విలియమ్స్ ఏడు ఫోర్లతో 45 పరుగులు చేసి ఔటయ్యాడు. వన్‌డౌన్‌లో వచ్చిన ముగియోంగా (15), కెప్టెన్ చకబ్వా (16), రియాన్ బర్ల్ (8) వెంటవెంటనే పెవిలియన్ చేరారు.

కదంతొక్కిన సికందర్

ఒకవైపు వికెట్లు పడుతున్నా స్టార్ బ్యాటర్ సికందర్ రజా పోరాటం కొనసాగించాడు. భారత బౌలర్లపై ఎదురుదాడి చేస్తే స్కోరును ముందుకు నడిపించాడు. అతనికి జొంగ్వా (14), బ్రాడ్ ఎవన్స్ (28) అండగా నిలిచారు. చారిత్రక బ్యాటింగ్‌తో అలరించిన సికందర్ 95 బంతుల్లోనే 9 ఫోర్లు, మరో 3 సిక్సర్లతో 115 పరుగులు చేసి ఔటయ్యాడు. తీవ్ర ఒత్తిడిని సయితం తట్టుకుంటూ సికందర్ కొనసాగించిన పోరాటాన్ని ఎంత పొగిడినా తక్కువే. అయితే కీలక సమయంలో అతను ఔట్ కావడంతో భారత్ ఊపిరి పీల్చుకుంది.

శుభ్‌మన్ జోరు

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్‌కు ఓపెనర్లు శిఖర్ ధావన్, కెఎల్ రాహుల్ శుభారంభం అందించారు. రాహుల్ (30), ధావన్ (40) పరుగులు సాధించారు. అయితే ఇద్దరు వెంటవెంటనే ఔట్ కావడంతో భారత్ 84 పరుగుల వద్ద రెండో వికెట్‌ను కోల్పోయింది. ఈ దశలో ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ తమపై వేసుకున్నారు. ఇద్దరు అద్భుత బ్యాటింగ్‌తో స్కోరును పరిగెత్తించారు. ధాటిగా ఆడిన ఇషాన ఆరు ఫోర్లతో 50 పరుగులు చేశాడు. ఇద్దరు కలిసి మూడో వికెట్ 140 పరుగులు జోడించారు. ఇక అద్భుత ఇన్నింగ్స్ ఆడిన శుభ్‌మన్ గిల్ 97 బంతుల్లోనే 15 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 130 పరుగులు చేశాడు. గిల్‌కు వన్డేల్లో ఇదే తొలి శతకం కావడం విశేషం.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News