Wednesday, November 13, 2024

107 మంది ఎంపీలు, ఎమ్‌ఎల్‌ఎలపై ద్వేష ప్రసంగాల కేసులు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : మొత్తం 107 మంది ఎంపీలు, ఎమ్‌ఎల్‌ఎలపై ద్వేష ప్రసంగాల కేసులు ఉన్నాయని, అలాంటి కేసులతో ఉన్న 480 మంది అభ్యర్థులు గత ఐదేళ్లుగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని ఎన్నికల హక్కుల సంఘం “ అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫార్మ్ (ఎడిఆర్) నివేదిక వెల్లడించింది. పదవుల్లో ఉన్న ఎంపిలు, ఎమ్‌ఎల్‌ఎలతోపాటు గత ఐదేళ్ల కాలంలో ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన అభ్యర్థులు సమర్పించిన అఫిడవిట్లను ఎడిఆర్, నేషనల్ ఎలెక్షన్ వాచ్ ( ఎన్‌ఇడబ్లు) సమగ్రంగా విశ్లేషించగలిగాయి.

దీని ప్రకారం ద్వేష ప్రసంగాల కేసులున్న33 మంది ఎంపీల్లో ఏడుగురు ఉత్తరప్రదేశ్, నలుగురు తమిళనాడు, బీహార్, కర్ణాటక, తెలంగాణ నుంచి ముగ్గురేసి, అస్సాం, గుజరాత్, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్ నుంచి ఇద్దరేసి, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, కేరళ, ఒడిస్సా, పంజాబ్ నుంచి ఒక్కొక్కరు వంతున ఉన్నారు. గత ఐదేళ్లలో అసెంబ్లీలు, లోక్‌సభ, రాజ్యసభల్లో పోటీ చేసిన 480 మంది అభ్యర్థులపై ద్వేష ప్రసంగాల కేసులు ఉన్నాయి. ఈ కేసులున్న 22 మంది ఎంపీలు బీజేపీకి చెందిన వారు కాగా, ఇద్దరు కాంగ్రెస్, ఆమ్‌ఆద్మీపార్టీ, ఎఐఎంఐఎం , ఎఐయుడిఎఫ్, డిఎంకె, ఎండిఎంకె, పిఎంకె ,శివసేన (ఉద్ధవ్ థాక్రే వర్గం) , విసికె నుంచి ఒక్కొక్కరు , ఒక ఇండిపెండెంట్ ఎంపివంతున ఉన్నారు.

ఇక 74 మంది ఎంఎల్‌ఎల్లో బీహార్, ఉత్తరప్రదేశ్ నుంచి తొమ్మిదేసి మంది, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ నుంచి ఆరుగురేసి, అస్సాం, తమిళనాడు, నుంచి ఐదుగురేసి, ఢిల్లీ, గుజరాత్, పశ్చిమబెంగాల్ నుంచి నలుగురేసి, ఝార్ఖండ్, ఉత్తరాఖండ్ నుంచి ముగ్గురేసి, కర్ణాటక, పంజాబ్, రాజస్థాన్ , త్రిపుర నుంచి ఇద్దరేసి, మధ్యప్రదేశ్, ఒడిస్సా నుంచి ఒక్కొక్కరు వంతున ఉన్నారు.

పార్టీల వారీగా చూస్తే ఎంఎల్‌ఎల్లో బీజేపీ కి చెందిన వారు 20 మంది , కాంగ్రెస్‌లో 13 మంది, ఆప్‌లో ఆరుగురు, ఎస్‌పి, వైఎస్‌ఆర్‌సిపిలో ఐదుగురేసి, డిఎంకె, ఆర్‌జెడి నుంచి నలుగురేసి, ఎఐటిసి, ఎస్‌హెచ్‌ఎస్ నుంచి ముగ్గురేసి , ఎఐయుడిఎఫ్ నుంచి ఇద్దరు, ఎఐఎంఐఎం, సిపిఎం, ఎన్‌సిపి, సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ , తెలుగుదేశం, తిప్రా మోతా పార్టీ, టిఆర్‌ఎస్ నుంచి ఒక్కొక్కరు వంతున , మరో ఇద్దరు ఇండిపెండెంట్ ఎమ్‌ఎల్‌ఎల పైన ద్వేష ప్రసంగాల కేసులు ఉన్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News