ఐదుగురిపై కేసు నమోదు
న్యూఢిల్లీ: హరిద్వార్‌లో ధర్మ సంసద్ నిర్వహించిన ఆర్గనైజర్ నరసింహానంద్‌తోపాటు మరో నలుగురు హిందూ మత ప్రచారకులపై కేసు నమోదైంది. ముస్లింలపై ద్వేషాన్ని రగిలించేలా ప్రసంగాలు చేశారన్న ఆరోపణలతో ఉత్తరాఖండ్ పోలీసులు కేసు నమోదు చేశారు. డిసెంబర్ 17 నుంచి 20 వరకు నిర్వహించిన ధర్మసంసద్‌లో హిందూ నేతలు చేసిన ప్రసంగాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పలువురు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసినవారిలో ఆర్‌టిఐ కార్యకర్త, టిఎంసి నేత సాకేత్‌గోఖలే కూడా ఉన్నారు. మతాల మధ్య విద్వేషాల్ని పెంచేలా ప్రసంగించడం ద్వారా ప్రార్థనా స్థలాన్ని అపవిత్రం చేశారని ఫిర్యాదుదారులు ఆరోపించారు. ఎఫ్‌ఐఆర్ నమోదైనవారిలో సాగర్‌సింధూమహరాజ్, సాథ్వీ అన్నపూర్ణ, ధరమ్‌దాస్, వసీమ్‌రిజ్వీఅకా జితేంద్రత్యాగి ఉన్నారు. ఎఫ్‌ఐఆర్‌లో నరసింహానంద్‌ది ఐదో పేరు. తామేమీ తప్పు చేయలేదని సంసద్ నిర్వాహకులు ,మత నేతలు సమర్థించుకుంటున్నారు.