Wednesday, January 22, 2025

హాథ్రస్ ప్రధాన నిందితుడు మధుకర్ అరెస్టు

- Advertisement -
- Advertisement -

మధుకర్‌ను కొన్ని పార్టీలు సంప్రదించినట్లు సమాచారం

నోయిడా : 121 మంది మృతికి దారి తీసిన హాథ్రస్ తొక్కిసలాటలో ప్రధాన నిందితుడు దేవ్‌ప్రకాశ్ మధుకర్‌ను హాథ్రస్ పోలీస్ ప్రత్యేక నిర్వహణ బృందం (ఎస్‌ఒజి) ఢిల్లీ నజఫ్‌గఢ్ ప్రాంతంలో అరెస్టు చేసినట్లు అధికారులు శనివారం వెల్లడించారు. శుక్రవారం రాత్రి పొద్దుపోయిన తరువాత అరెస్టయిన మధుకర్‌ను కొన్ని రాజకీయ పార్టీలు ఇటీవల సంప్రదించినట్లు హాథ్రస్ పోలీస్ సూపరింటెండెంట్ (ఎస్‌పి) నిపుణ్ అగర్వాల్ తెలియజేశారు. స్వయంప్రకటిత స్వామవ సూరజ్‌పాల్ ఉరఫ్ నారాయణ్ సకర్ హరి ఉరఫ్ భోలె బాబా కార్యక్రమాలకు నిధుల సేకర్తగా మధుకర్ పని చేసినట్లు, విరాళాలు సేకరించినట్లు అగర్వాల్ తెలిపారు. మధుకర్ రిమాండ్ కోసం పోలీసులు దరఖాస్తు చేయగలరని ఆయన చెప్పారు.

‘అతని ఆర్థిక లావాదేవీలు, డబ్బు పంపిణీ వ్యవహారాలు పరిశీలిస్తున్నాం, కాల్ వివరాల రికార్డులు కూడా తనిఖీ చేస్తున్నాం’ అని అగర్వాల్ తెలియజేశారు. అయితే, మధుకర్ ఢిల్లీలో పోలీసులకు లొంగిపోయినట్లు, అతను వైద్య చికిత్స నిమిత్తం ఢిల్లీ వచ్చినట్లు మధుకర్ న్యాయవాది ఎపి సింగ్ తెలిపారు. శనివారం మధ్యాహ్నం సుమారు 2.15 గంటలకు మధుకర్‌ను భారీ భద్రత నడుమ హాథ్రస్‌లోని బగ్లా సమష్టి జిల్లా ఆసుపత్రికి పోలీసులు తీసుకువచ్చారు. మధుకర్ ముఖాన్ని చేతిరుమాలుతో కప్పుకున్నాడు. తొక్కిసలాట జరిగిన సత్సంగ్‌కు మధుకర్ ముఖ్య సేవాదార్. ఆసంఘటన సందర్భంగా హాథ్రస్‌లోని సికంద్ర రావు పోలీస్ స్టేషన్‌లో దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో నిందితునిగా అతని పేరు మాత్రమే ఉన్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News