- Advertisement -
ముగ్గురు నిందితుల విడుదల
లక్నో: 19 ఏళ్ల దళిత బాలిక హత్రాస్ మానభంగం, హత్య కేసులో ఉత్తరప్రదేశ్ స్పెషల్ కోర్టు గురువారం ఒకరిని దోషిగా తేల్చి, ఇతరులు ముగ్గురిని నిర్దోషులుగా విడుదలచేసింది. రాము, లవ్‌కుశ్, రవిలను నిర్దోషులుగా తేల్చి, సందీప్‌ను దోషిగా నిర్దారించింది.
హత్రాస్‌లో బాధితురాలిని 2020 సెప్టెంబర్ 14న నిందితుడు సామూహిక మానభంగం తర్వాత చంపేందుకు ప్రయత్నించాడు. కాగా ఆమె ఢిల్లీలోని సఫ్దార్‌జంగ్ ఆసుపత్రిలో చివరికి గాయాలతో చనిపోయింది. ఆమె మృత దేహం తన స్వస్థలానికి చేరకున్నాక యూపి పోలీసులు కుంటుంబ సభ్యులు హాజరుకాంకుండానే బలవంతంగా అంత్యక్రియలు ముగించేశారు.
- Advertisement -