Saturday, July 6, 2024

హథ్రాస్ తొక్కిసలాట మృతుల సంఖ్య 121కి పెరుగుదల

- Advertisement -
- Advertisement -

ఉత్తర ప్రదేశ్‌లోని హథ్రాస్‌లో సత్సంగ్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో మృతుల సంఖ్య బుధవారం 121కి పెరిగింది. నిర్వాహకులపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ దాఖలు చేశారు. వారు దాఖలాలు దాచారనిచ, 80 వేల మంది మాత్రమే పట్టే వేదికలోకి 2.5 లక్షల మంది ప్రజలను ఇరికించడం ద్వారా షరతులను ఉల్లంఘించారని ఎఫ్‌ఐఆర్‌లో పోలీసులు ఆరోపించారు. మత బోధకుడు భోలె బాబా ఫుల్రాయి గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో తొక్కిసలాట జరిగి తమ ప్రియతములను కోల్పోయిన మరునాడు ఆ కుటుంబాలు ఆ నష్టాన్ని దిగమింగుకోవడానికి తంటాలు పడుతున్నారు.

ఆసుపత్రుల చుట్టూ జనం చేరారు. వారిలో కొందరు అదృశ్యమైనవారి కోసం చూస్తుండగా, మరి కొందరు మృతదేహాల గుర్తించడంలో నిమగ్నమయ్యారు. ఇతరులు క్షతగాత్రులను పరామర్శిస్తున్నారు. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తొక్కిసలాటలో గాయపడినవారిని పరామర్శించారు. సహాయ కార్యక్రమాల కమిషనర్ కార్యాలయం సమాచారం ప్రకారం, క్షతగాత్రుల సంఖ్య 28. 121 మంది మృతుల్లో నలుగురిని మాత్రమే గుర్తించవలసి ఉంది.

తొక్కిసలాట మృతులకు పుతిన్ సంతాపం
ఇది ఇలా ఉండగా, హథ్రాస్‌లో తొక్కిసలాటపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రగాఢ విచారం వెలిబుచ్చారు. ‘ఉత్తర ప్రదేశ్‌లో విషాదకర తొక్కిసలాటపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు, ప్రధాని నరేంద్ర మోడీకి సంతాప సందేశం పంపారు. ఉత్తర ప్రదేశ్ దుర్ఘటనపై అత్యంత ప్రగాఢ సంతాపం తెలియజేశారు’ అని ఢిల్లీలోని రష్యా రాయబార కార్యాలయం ‘ఎక్స్’ పోస్ట్‌లో పేర్కొన్నది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News