Wednesday, January 22, 2025

హాత్రాస్ ఘటన కేసు: ప్రధాన నిందితుడికి 14 రోజులు రిమాండ్

- Advertisement -
- Advertisement -

హత్రాస్ తొక్కిసలాట ఘటనలో ప్రధాన నిందితుడి దేవ్ ప్రకాష్ మధుకర్‌కు మేజిస్ట్రేట్ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడి విధించింది. ఈ కేసులో అరెస్టయిన మరో నిందితుడు సంజు యాదవ్‌ను కూడా 14 రోజుల రిమాండ్ విధించినట్లు అధికారులు తెలిపారు. తొక్కిసలాట ఘటన తర్వాత పరారీలో ఉన్న మధుకర్‌ను హత్రాస్ పోలీసులు ఢిల్లీలో అరెస్ట్ చేశారు.  ఆ తర్వాత కాల్ హిస్టరీ, బ్యాంక్ అకౌంట్లను పరిశీలించిన పోలీసులు.. సత్సంగ్ ల పేరుతో రాజకీయ పార్టీల నుంచి మధుకర్ నిధుల సేకరించినట్లు గుర్తించారు.

జూలై 2న జరిగిన హత్రాస్ తొక్కిసలాట ఘటనలో 116 మంది మహిళలు, నలుగురు చిన్నారులు, ఒక పురుషుడితో సహా 121 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటివరకు ఆరుగురిని పోలీసులు అరెస్టు చేయగా.. ఈ ఘటనకు కారణమైన భోలే బాబా పరారీలో ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News