Friday, March 21, 2025

8 మంది విద్యార్థినులపై ప్రొఫెసర్ అత్యాచారం… వీడియో రికార్డు

- Advertisement -
- Advertisement -

లక్నో: పలువురు విద్యార్థినులపై ప్రొఫెసర్ అత్యాచారం చేసిన అనంతరం వీడియోలు రికార్డు చేశాడు. వీడియోలతో వారిని బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం హథ్రాస్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… రాజ్‌నీష్ కుమార్(59) అనే వ్యక్తి జియోగ్రఫీ డిపార్ట్‌మెంట్‌లో ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. ఇంటర్‌నల్ ఎగ్జామ్స్ లో ఎక్కువ మార్కులు వేయడంతో పాటు జాబ్ అవకాశాలు కల్పిస్తామని విద్యార్థినిలకు ఆశ చూపి వారిపై రాజ్‌నీష్ కుమార్ అత్యాచారం చేసినట్టు ఆరోపణలు వచ్చాయి.

ఎనిమిది మంది విద్యార్థినులను తన ఇంటికి పిలుపించుకొని అత్యాచారం చేసి అనంతరం వీడియో రికార్డు చేసి బ్లాక్‌మెయిల్ పాల్పడేవాడు. రాజ్‌నీష్ వేధింపులు ఎక్కువ కావడంతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో విద్యార్థినులు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి ప్రయాగ్‌రాజ్‌లో అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. బాధితులలో సీనియర్ విద్యార్థినుల కూడా ఉన్నట్టు సమాచారం. పరువు పోతుందనే భయంతో సీనియర్ విద్యార్థినులు పోలీస్ స్టేషన్ లలో ఫిర్యాదు చేయడానికి వెనుకంజ వేస్తున్నట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News