లక్నో: ప్రేమికురాలు పారిపోవడానికి రాలేదని పదో తరగతి అమ్మాయిని తుపాకీతో కాల్చి అనంతరం 18 ఏళ్ల యువకుడు తనను తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ రాస్ట్రా హథ్రాస్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. సరోత్ గ్రామంలో ఓ అమ్మాయ పదో తరగతి చదువుతూ తన కుటుంబ సభ్యులతో కలిసి ఉంటుంది. ప్రిపాల్ గ్రామానికి చెందిన ఓ యువకుడు తన సోదరి ఉంటున్న సరోత్ గ్రామంలో గత 12 సంవత్సరాల నుంచి నివసిస్తున్నాడు. అమ్మాయి, యువకుడు మధ్య గత కొన్ని రోజుల నుంచి ప్రేమాయణం నడుస్తోంది. గత కొన్ని రోజుల నుంచి పారిపోదామని బాలికను యువకుడు బలవంతం చేస్తున్నాడు.
యువతి ఇంటికెళ్లి పారిపోదామని యువకుడు బలవంతం చేశాడు. ఆమె నిరాకరించడంతో తుపాకీ తీసుకొని ఆమె తలపై కాల్చాడు. అనంతరం యువకుడు కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు గమనించి వెంటనే బాలికను ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందిందని పరీక్షించిన వైద్యులు తెలిపారు. డిఎస్‌పి హిమాన్షు తన సిబ్బందితో సరోత్ గ్రామానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రెండు రోజుల క్రితం యువకుడు తన సోదరి ఇంట్లో బంగారు ఆభరణాలు దొంగతనం చేశాడు. పారిపోవడానికి బంగారు ఆభరణాలు దొంగతనం చేసి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.