లక్నో: 30 ఏళ్ల క్రితం తండ్రిని కుమారులు చంపిన విషయం ఇప్పుడు వెలుగులో వచ్చింది. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం హాథ్రస్ లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. 1994వ సంవత్సరంలో తన తండ్రి బుధమ్ సింగ్ కనిపించకుండాపోయాడని కలెక్టర్ కు అతడి కుమారుడు పంజాబీ సింగ్ ఫిర్యాదు చేశాడు. తనకు తొమ్మిదేళ్ల వయసు ఉన్నప్పుడు ఇద్దరు సోదరులు మరో వ్యక్తితో కలిసి తన తండ్రిని చంపి ఇంటి ఆవరణంలో పాతి పెట్టారని కలెక్టర్ కు తెలిపాడు. వెంటనే ఈ కేసును దర్యాప్తు చేయాలని పోలీసులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశాడు.
పోలీసులు ఇంట్లో తవ్వి అస్థిపంజరాన్ని బయటకు తీశారు. డిఎన్ఓ పరీక్షల నిమిత్తం అస్తి పంజరాన్ని ల్యాబ్ కు పంపించారు. బుధమ్ సింగ్ వ్యవసాయం చేస్తూ జీవనం సాగించేవారు. సోదరుల మధ్య గొడవ రావడంతో 30 సంవత్సరాల క్రితం తన తండ్రితో జరిగిన గొడవ పంజాబీ గుర్తుకు వచ్చి అన్నలను ప్రశ్నించాడు. సోదరులు పంజాబీ సింగ్ బెదిరించడంతో తన తండ్రి అదృశ్యకావడానికి తన సోదరులే కారణమని కలెక్టర్ కు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి అస్తి పంజరాన్ని స్వాధీనం చేసుకొని డిఎన్ఎ టెస్టుకు పంపించారు. డిఎన్ఎ ఆధారంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
30 ఏళ్ల క్రిితం తండ్రిని చంపి… ఇంట్లోనే పాతిపెట్టాడు… ఇప్పుడు వెలుగులోకి
- Advertisement -
- Advertisement -
- Advertisement -