Thursday, January 23, 2025

తెలంగాణ కోసం బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌లు ఏమైనా త్యాగాలు చేశాయా?

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: కమ్యూనిస్టు పార్టీ భావజాలం, పోరాటాలు లేకుండా తెలంగాణ లేదని సిపిఐ నేత, మాజీ ఎంఎల్ఎ కూనంనేని సాంబశివరావు తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కష్టం, శ్రమ, త్యాగం ఒకరివి, భోగాలు మరొకరివని మండిపడ్డారు. తెలంగాణ కోసం బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌లు ఏమైనా త్యాగాలు చేశాయా? అని పశ్నించారు. కమ్యూనిస్టు చరిత్రను బిజెపోళ్లు వక్రీకరించాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 17ను విలీన దినోత్సవంగా గుర్తించాలన్నారు. నాటి సాయుధ పోరాట చరిత్రను పాఠ్య పుస్తకాల్లో చేర్చాలని కూనంనేని డిమాండ్ చేశారు. కమ్యూనిస్టు పార్టీకి మళ్లీ పూర్వ వైభవం తెచ్చేలా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News