Monday, December 23, 2024

మున్సిపాలిటీ అభివృద్ధ్దికి కోట్లది నిధులు తీసుకొచ్చా

- Advertisement -
- Advertisement -

కోస్గి: నూతనంగా ఏర్పడిన కోస్గి మున్సిపాలిటీ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటే మౌలిక సదుపాయాలు కల్పించడమే తమ లక్ష్మమని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు.శుక్రవారం బాలాజీ ఫంక్షన్ హాల్‌లో తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా పట్టణ ప్రగతి దినోత్సవంలో కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన కోస్గి మున్సిపాలిటీ అభివృద్ధి కోసం సిఎం కెసిఆర్,మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్‌ల సహకారంతో కోట్లది నిధులతో ఎన్నో అభివృద్ధి పనులు చేస్తున్నామని అన్నారు. మున్సిపాలిటీలలో భావితరాలకు ఉపయోగపడే అభివృద్ధ్ది, సంక్షేమ పథకాలు అందిస్తున్నమన్నారు. సిఎం కెసిఆర్ పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా భారీగా నిధులు కేటాయించి నూతనంగా ఏర్పాడిన కోస్గి మున్సిపాలిటీలో ఇప్పటి వరకు కోట్ల రూపాయలతో అభివృద్ధ్ది,సంక్షేమ కార్యక్రమాలను చేపట్టినట్లు వారు తెలిపారు.

ఇందులో భాగంగా మార్కెట్ యాడ్,బస్టాండ్,బస్‌డిపో.వైకుంఠధామం,క్రీడా ప్రాంగణాలు, పబ్లిక్ టాయిలైట్లు,పార్కులు,ఓపెన్ జిమ్‌లు,సెంట్రల్ లైటింగ్ తదితర నిర్మాణాలను చేపట్టినట్లు వారు వివరించారు.కోస్గి మున్సిపాలిటీని అన్ని హంగులతో ఆదర్శవంతంగా తయారు చేస్తానని అన్నారు.

అనంతరం మున్సిపల్ కౌన్సిలర్లకు,సిబ్బంది,కార్మికులకు ఘనంగా సన్మానించి ప్రశంసా పత్రాన్ని అందజేశారు.అంతకుముందు మున్సిపాలిటీ కార్యాలయంలో మున్సిపల్ చైర్‌పర్సన్ మ్యాకల శిరీష జాతీయ జెండాను ఎగురవేశారు.పట్టణంలో మున్సిపల్ కార్యాలయం నుంచి శివాజీ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.మొత్తం మీద పట్టణ వ్యాప్తంగా పండుగ వాతావరణంగా మారింది.

కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ శాసం రామకృష్ణ,సింగల్ విండో చైర్మన్ తూం భీంరెడ్డి,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వరప్రసాద్,కౌన్సిలర్లు మాస్టర్ శ్రీను,భలేష్,బందెప్ప,మున్సిపల్ కమీషనర్ శశిధర్,మేనేజర్ శంకర్‌లతో పాటు మున్సిపల్ కార్మికులు,సిబ్బంది,మహిళలు,ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News