Sunday, December 22, 2024

మల్కాజిగిరిలో ఒక్క పేదోడికైనా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇచ్చారా..?

- Advertisement -
- Advertisement -

మల్కాజిగిరి: డబుల్ బెడ్ రూమ్ హమీ నెరవేర్చడంలో పాలకులు ఘోరంగా విఫలమైనారని కాంగ్రెస్ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షుడు నందికంటి శ్రీధర్ విమర్శించారు. ఐదేళ్లు పూర్తవుతున్నా.. మల్కాజిగిరిలో ఒక్కరంటే ఒక్క పేదవాడికైనా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇచ్చారా..? దశాబ్ది ఉత్సవాలు ఆర్భాటం, హాంగామా తప్ప, పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఊసేది..అని ఆయన ప్రశ్నించారు. అర్హులైన వారందరికి పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇచ్చేంత వరకు కాంగ్రెస్ పార్టీ వివిధ రూపాలలో ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. అర్హులైన పేదలందరికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బుధవారం మల్కాజిగిరి చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ధీక్ష చేపట్టారు.

ఈ కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక పేదలందరికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తానని సీఎం కేసీఆర్ ప్రకటించారని, మల్కాజిగిరి ఇందిరానెహ్రునగర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ఇదే హమీని ఇచ్చారని గుర్తు చేశారు. నేటికి పది ఏళ్లు పాలన పూర్తవుతున్నా మల్కాజిగిరి నియోజకవర్గంలోని పేదలకు ఒక్కరికైనా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వక పోవడం శోచనీయమన్నారు. నేటికి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్లు కనిపిస్తున్నాయే కాని, మల్కాజిగిరి నియోజకవర్గంలో అర్హులైన 20 వేల మంది దరఖాస్తు చేసుకున్నప్పటికి కనీసం ఒక్కరంటే ఒక్క నిరు పేదకైనా తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వ లేక పోయిందని పాలకుల వైఫల్యాన్ని ఆయన తప్పుపట్టారు.

కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే ఇచ్చిన హమీలను నెర వేరుస్తుందని, పేదలందరికి మేలు జరుగుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వ హయంలో ఆ కుటుంబానికే మాత్రమే ఇంద్రభవనాలు వచ్చాయని, పేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఉత్తుతి హామీలుగానే మారాయని, ఇవి గుర్తించి రానున్న ఎన్నికల్లో ఓటు వేసే ముందు మల్కాజిగిరి నియోకవర్గంలోని పేదలందరూ ఆలోచించుకోని ఓటు వేయాలని సూచించారు. మల్కాజిగిరి నియోజవర్గంలో పేదల ఓట్లు కావాలని కోరుకునే స్థానిక ఎమ్మెల్యేగాని, ఆ పార్టీ కార్పొరేటర్లు గాని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఎందుకు ఇప్పించ లేక పోయారో చెప్పాలని, ఐదేళ్లు పూర్తవుతున్నా ఎందుకు నోరు మెదపరని ఆయన ప్రశ్నించారు. పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ఇచ్చేంత వరకు కాంగ్రెస్ పార్టీ తన పోరాటం కొనసాగిస్తుందని నందికంటి శ్రీధర్ భరోసానిచ్చారు.

ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి బి బ్లాక్ అధ్యక్షుడు వెంకటేష్‌యాదవ్, మల్కాజిగిరి డివిజన్ అధ్యక్షుడు వి. శ్రీనివాస్‌గౌడ్, మౌలాలి కంటెస్టెడ్ కార్పొరేటర్ పోతుల ఉమామహేశ్వరీ యాదవ్, ఓబీసీ సెల్ ఛైర్మన్ పోతుల వినోద్‌యాదవ్, మీడియా కన్వీనర్ గుత్తి రాంచందర్, ఎస్సీ సెల్ ఛైర్మన్ సానాది శంకర్, మైనార్టీ సెల్ ఛైర్మన్ మహ్మద్ అలీ, మౌలాలి, ఆనంద్‌బాగ్,వినాయక్‌నగర్ డివిజన్‌ల అధ్యక్షులు వంశీ ముదిరాజ్, ఉమేష్‌సింగ్, సంతోష్ ముదిరాజ్, సీనియర్ నాయకులు సిరిగిరి నర్సింగరావు, కేశెట్టి రాములు, జీడి. సత్యనారాయణగౌడ్, వేముల వెంకటేష్, ఏ. లింగారెడ్డి, జీవన్‌రెడ్డి, గౌస్ బాయ్, సురేష్‌యాదవ్, ప్రవీణ్, బికె శ్రీనివాస్, ఎం ఆర్ శ్రీనివాస్‌యాదవ్, రెబ్బవాసు, బుచ్చిబాబు,శ్యామ్‌రావు, వేణు, యాదగిరి, హరి శంకర్, జెకెసాయి, నాగేష్‌గౌడ్, నరహరిగౌడ్, హనుమంతు, గణేష్, సాయి, ఆశ, రోజా రమణి, స్వప్న, ప్రభ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News