Wednesday, March 12, 2025

పిల్లల్ని కనండి..కానీ ఎక్కువ మంది వద్దు : ఉదయనిధి స్టాలిన్

- Advertisement -
- Advertisement -

లోక్‌సభ నియోజకవర్గ పునర్విభజన విషయంలో తమిళనాడు గత కొంతకాలంగా కేంద్రంపై విమర్శలు గుప్పిస్తోన్న సంగతి తెలిసిందే. జనాభా ప్రాతిపదికన మాత్రమే నియోజకవర్గాలను నిర్ణయిస్తే, రాష్ట్రంలో లోక్‌సభ స్థానాలు తగ్గుతాయని అక్కడి నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా ఉదయనిధి 72 మంది జంటలకు సామూహిక వివాహాలు జరిపించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కొత్తగా పెళ్లైన జంటలు అత్యవసరంగా పిల్లల్ని కనాలని కోరారు. అయితే ఎక్కువ మందిని మాత్రం కనొద్దని సూచించారు. “ 2026 తర్వాత అమల్లోకి వచ్చే ఈ డీలిమిటేషన్ ప్రక్రియ జనాభా ఆధారంగా పార్లమెంటరీ నియోజకవర్గాలను తిరిగి రూపొందిస్తుంది.

రాష్ట్రాల్లోని జనాభాకు సరైన ప్రాతినిధ్యం లభించేలా పార్లమెంటులో , అసెంబ్లీల్లో సీట్లుండేలా చూసే ప్రక్రియలో ఎక్కువ సీట్లు ఇవ్వాలంటే , కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు జనాభా సంఖ్యను పర్యవేక్షిస్తోంది. తమిళనాడుతోసహా దక్షిణాది రాష్ట్రాలు దశాబ్దాలుగా జననాల రేటను నియంత్రిస్తూ వస్తున్నాయని, దీని మూలంగా పార్లమెంటరీ ప్రాతినిధ్యంలో వాటి వాటా తగ్గే అవకాశం ఉంది ” అని స్టాలిన్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తమిళనాడు నుంచి 39 మంది ఎంపీలు ఉన్నారని, రాష్ట్ర జనాభౠ 7 కోట్లు కాబట్టి , డీలిమిటేషన్ ప్రక్రియ అమల్లోకి వస్తే ఆ సంఖ్య 31 కి తగ్గుతుందని ఆయన అన్నారు. అయితే ఎక్కువ జనాభా ఉన్న ఉత్తరాది రాష్ట్రాలు మాత్రం 100 కు పైగా సీట్లు పొందే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీని ప్రకారం చూస్తే రాష్ట్ర జనాభా కూడా అధికంగా ఉండాలని ఉపముఖ్యమంత్రి పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News