Monday, December 23, 2024

నిజం చెపుతున్నా నా భుజంలో భారత్ టీకానే

- Advertisement -
- Advertisement -

Have the Indian jab in my arm, it did me good

బ్రిటన్ ప్రధాని జాన్సన్ వెల్లడి
ఇండియా టీకా ఉత్పత్తికి కితాబు

న్యూఢిల్లీ : కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తి పంపిణీ దిశలో భారతదేశపు కృషి పట్టుదల ఇప్పుడు అంతర్జాతీయ ఖ్యాతి స్థాయికి వెళ్లిందని ప్రధాని బోరిస్ జాన్సన్ తెలిపారు. ఇక్కడే నిజం చెపుతున్నా తన భుజంలో దిగింది భారతీయ టీకానే అని శుక్రవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. ఎందరో ఈ వ్యాక్సిన్ తీసుకున్నారని తానూ వేయించుకున్నానని ఇప్పుడు వైరస్ నుంచి సురక్షితంగా ఉన్నానని తెలిపారు. భారతదేశం పలు ఔషధాల ఉత్పత్తితో ప్రపంచస్థాయిలో మెడికల్ హబ్ అవుతోంది. ప్రపంచ కలవర కారక వైరస్ విరుగుడు టీకాల తయారీకి ఇప్పుడు భారత్ సెంటర్‌పాయింటు అయింది. ఫార్మసీ కేంద్రం అయిందన్నారు. వైరస్ బారిన పడిన తను తిరిగి కోలుకుని ఇది జోలికి రాకుండా చేసిన భారత్ టీకాకు భారత్‌కు తన థ్యాంక్స్ అని జాన్సన్ తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News