Monday, December 23, 2024

‘హావెల్స్’ సరికొత్త ఫ్యాన్లు

- Advertisement -
- Advertisement -

Havells India has unveiled the latest Ecoactive fans

హైదరాబాద్ : రాబోయే వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రముఖ ఎఫ్‌ఇజిజి కంపెనీ హావెల్స్ ఇండియా సరికొత్త ఎకోయాక్టివ్ ఫ్యాన్‌లను ఆవిష్కరించింది. సీలింగ్, పెడస్ట్రల్, వాల్, వెంటిలేటర్ ఫ్యాన్ కేటగిరీ కింద 19 కొత్త మోడళ్లను ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా హావె ల్స్ ఇండియా ప్రెసిడెంట్ (ఎలక్ట్రికల్ కన్స్యూమర్ డ్యూరబుల్స్) రవీంద్ర సింగ్ నేగి మాట్లాడుతూ, మొదటిసారి ఎనర్జీ ఎఫెషియన్సీ బిఎల్‌డిసి ఎల్‌డిసి వాల్ పెడెస్టల్ శ్రేణితో సహా తక్కువ శక్తి వినియోగించే వాటిని ఇష్టపడే వారికోసం ప్రవేశపెట్టామని అన్నారు. ఎకోయాక్టివ్ ఫ్యాన్ తక్కువ విద్యు త్ వినియోగంతో పని చేసేలా రూపొందించారని అన్నారు.

విద్యుత్ వినియోగాన్ని 50 శాతం వర కు ఆదా చేయగలదని, ఎకోయాక్టివ్ ఫ్యాన్‌ల నూ తన శ్రేణి సూపర్ ఎఫిషియంట్ బిఎల్‌డిసి, ఇంట్రడక్షన్ మోటార్‌తో వస్తా యి. ఎకోయాక్టివ్ సీలింగ్ ఫ్యాన్ కేటగిరీ కిం ద హావెల్స్ సూపర్-సైలెంట్ స్టీల్త్ ఎయిర్ నియో, స్టెల్త్ ఎయిర్ ప్రైమ్ సీలింగ్ ఫ్యాన్‌లతో 6 సరికొత్త మోడళ్లను కూడా విడుదల చేసిం ది. దీనిలోని ఇత ర ఫీ చర్లలో రిమోట్ కంట్రోల్ ఆపరేషన్, మెమరీ బ్యాక్-అప్, రాత్రిపూట సౌక ర్యం కోసం స్లీప్ ఇబ్రీజ్ మోడ్‌లు, తక్కువ వోల్టేజీల వద్ద స్థిరమైన పనితీరును అందించడానికి బిల్ట్ వోల్టేజ్ స్టెబిలైజేషన్, స్మూత్ స్వింగ్ ఆపరేషన్ కో సం మోటరైజ్డ్ ఆసిలేషన్ వంటి మోడ్‌లున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News