Sunday, December 22, 2024

ఎన్నికల్లో హవాలా డబ్బు…

- Advertisement -
- Advertisement -

ఇప్పటి వరకు ఎన్నికల్లో హవాలా డబ్బులు రాలేదు, కాని 2018 ఎన్నికల్లో రాజకీయ నాయకులు ఎక్కువగా హవాలా వ్యాపారులను ఆశ్రయించారు. ఈ ఏడాది హవాలా వ్యాపారం చేసే వారిపై పోలీసులు గట్టి నిఘా పెట్టడంతో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో హవాలా వ్యాపారులు వెనుకడుగు వేస్తున్నారు. గతంలో కమీషన్ చెల్లించి వారు డబ్బులు తీసుకువచ్చి ఇచ్చే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నారు.

ఇందులో భాగంగా గత ఎన్నికలకు రెండు రోజుల ముందు నాంపల్లి వద్ద వాహన తనిఖీల్లో ఓ రాజకీయ నాయకుడి రూ.50లక్షలు టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. హవాలా ఏజెంట్లు తరలిస్తుండగా వారికి సమావచారం రావడంతో పట్టుకున్నారు. నగరంలో పోలీసుల తనిఖీ ఎక్కువ కావడంతో రిస్కు తీసుకునేందుకు రాజకీయ నాయకులు 2023 ఎన్నికల్లో రాజకీయ నాయకులు ముందుకు రాలేదు. ఈ ఎన్నికల్లో రాజకీయ నాయకులు తమ అనుచరుల ద్వారా నగదును తరలించారు.

తక్కువ మొత్తంలో నగదు తరలిస్తుండగా పోలీసులు చెక్‌పోస్టుల వద్ద పట్టుకున్నారు. మామూలు సమయంలో 0.50 నుంచి 2 శాతం కమీషన్ తీసుకునే వ్యాపారులు ఎన్నికల నేపధ్యంలో 5 నుంచి 10 శాతం కమీషన్ తీసుకుని డబ్బులు చేరవేశారు. రాజకీయ నాయకులకు డబ్బులు సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్న వారిని నగర టాస్క్‌ఫోర్స్, స్టాటిక్ సర్వేలెన్స్, ఫ్లయింగ్ స్క్వాడ్ పట్టుకున్నాయి. వారి వద్ద నుంచి పెద్ద మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నాయి. గత ఎన్నికల్లో పోలీసులు ఎనిమిది మందిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.7.51కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ డబ్బు ఓటర్లకు పంచేందుకు తీసుకువెళ్తున్నట్లు తెలిసింది.

ఇంత భారీ మొత్తంలో నగదు లభించడం నగరంలో మొదటిసారి. అలాగే గత అసెంబ్లీ ఎన్నికల్లో వెస్ట్, నార్త్ జోన్ పోలీసులు బంజారాహిల్స్, రోడ్డు నంబర్ 36లో దాడి చేసి రూ.3,13,44,000 స్వాధీనం చేసుకున్నారు. నగదు ఎన్నికల్లో పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. గుజరాత్‌కు చెందిన వ్యాపారి కార్యాలయాలు అబిడ్స్, బంజారాహిల్స్‌లో దాడి చేసి వారి వద్ద నుంచి రూ.1,40,00,000 స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల నేపథ్యంలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో హవాలా వ్యాపారులు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ నుంచి తమ స్థావరాలను వేరే చోటికి మార్చారు. పోలీసులు హవాలా వ్యాపారులపై ప్రత్యేకంగా దృష్టిసారించడంతో బేగంబజార్‌లో చాలామంది ఎన్నికల్లో డబ్బులు చేరవేసేందుకు ఈ ఎన్నికల్లో ముందుకు రాలేదు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News