Monday, December 23, 2024

హవాలా డబ్బులు పట్టివేత

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః వాహనాల తనిఖీల్లో లెక్క చెప్పని హవాలా డబ్బులను ఐఎస్ సదన్ పోలీసులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. నలుగురు వ్యక్తులు కారులో రూ.20లక్షలు తీసుకుని వెళ్తుండగా పట్టుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం….ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్ ఎస్సై మహేష్ డిఎంఆర్‌ఎల్ ఎక్స్ రోడ్డు వద్ద వాహనాలను తనిఖీ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే స్విఫ్ట్ డిజైర్ కారులో నలుగురు వ్యక్తులు వస్తున్నారు. వారిని ఆపి కారులో తనిఖీలు చేయగా క్లాత్ బ్యాగులో రూ.20,00,000 లభించాయి.

డబ్బుల ఆధారాలు చూపించాలని విట్టల్, నాగరాజు, శ్రీకాంత్ రెడ్డి, వెంకటేష్‌ను పోలీసులు అడిగారు. వారు పొంతనలేని సమాధానాలు చెప్పారు. తాము 101 రియల్ ఎస్టేట్ కంపెనీలో పనిచేస్తున్నామని నాగరాజు, శ్రీకాంత్ రెడ్డి చెప్పారు. కూకట్‌పల్లి నుంచి ఎల్‌బి నగర్ వరకు క్యాబ్ బుక్ చేసుకున్నామని, డ్రైవర్ వెంకటేష్‌గా ఉన్నాడని చెప్పారు. కంపెనీ తరఫున ప్లాట్ కొనుగోలు చేసేందుకు వెళ్తున్నట్లు చెప్పారు. డబ్బులను పోలీసులు సీజ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News