Tuesday, November 5, 2024

హవాలా రాకెట్‌ను పట్టుకున్న పోలీసులు

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః హవాలా డబ్బులు తరలిస్తున్న ఇద్దరిని సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారు తరలిస్తున్న రూ.10లక్షలు, బైక్, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…నగరంలోని అంబర్‌పేటకు చెందిన మన్‌ప్రీత్ సింగ్ స్క్రాప్ వ్యాపారం చేస్తున్నాడు, షేక్ అర్షద్ ఆఫీస్‌బాయ్‌గా పనిచేస్తున్నాడు. అంబర్‌పేటలోని వ్యాపారం చేస్తున్న మన్‌ప్రీత్‌సింగ్ అక్కడికి సమీపంలో ఓ ఆఫీస్‌ను ఏర్పాటు చేసుకుని ఆఫీస్ బాయ్‌గా షేక్ అర్షద్‌ను నియమించుకున్నాడు. అక్కడి నుంచే హవాలా వ్యాపారం చేస్తున్నాడు. హవాలా మనీ ట్రాన్స్‌ఫర్ ఏజెంట్లతో కలిసి కమీషన్ తీసుకుని నగదును తరలిస్తున్నాడు. నిందితుడు మెట్రోపాలిటన్ సిటీల్లో హవాలా ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు.

హవాలా కోసం నిందితులు వాట్సాప్, మెసేజ్‌లను కోడ్ భాషలో పంపించుకుంటున్నారు. ఇన్‌కంట్యాక్స్ తప్పించుకోవడానికి హవాలా ఏజెంట్లను సంప్రదించిన వారి వద్ద నుంచి కమీషన్ తీసుకుని వీరు వ్యాపారం నిర్వహిస్తున్నారు. మన్‌ప్రీత్‌సింగ్ తనకు వచ్చిన సమాచారంతో రూ.10లక్షలను తన వద్ద పనిచేస్తే షేక్ అర్షద్‌తో కలిసి బైక్‌పై వెళ్తుండగా పోలీసులు చిరాగ్ అలీ రోడ్డు వద్ద పోలీసులు తనిఖీ చేయగా రూ.10లక్షలు లభించాయి. వాటి గురించి ఆధారాలు చూపించాల్సిందిగా పోలీసులు కోరగా, వారు చూపించలేకపోయారు. వెంటనే నగదును సీజ్ చేసి అబిడ్స్ పోలీసులకు అప్పగించారు. ఇన్స్‌స్పెక్టర్ రాజు నాయక్, ఎస్సైలు సాయికిరణ్, నవీన్‌కుమార్ తదితరులు పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News