Wednesday, January 22, 2025

క్లాస్‌మేట్‌పై అత్యాచారం… వీడియోను చిత్రీకరించి…

- Advertisement -
- Advertisement -

రంగారెడ్డి: ఇచ్చిన అప్పు తిరిగి ఇవ్వకపోవడంతో విద్యార్థినిపై క్లాస్‌మేట్ అత్యాచారం చేసి అనంతరం వీడియో తీసి వైరల్ చేయడంతో పాటు అతడి స్నేహితులు ఆమెను వేధించిన సంఘటన రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. హైదరాబాద్‌లోని నారాయణగూడలో ఓ కాలేజీలో యువతి ఎంబిఎ చదువుతోంది. యువతికి ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడంతో తన క్లాస్‌మెట్ దగ్గర అప్పు తీసుకుంది. నిర్ణీత సమయంలో అప్పు చెల్లించకపోవడంతో క్లాస్‌మెట్ ఆమెను వెంటనే అప్పు తీర్చాలని బలవంతం చేశాడు.

Also Read: కామారెడ్డిలో అన్నను చంపిన తమ్ముడు

అప్పు తీర్చకపోతే తన కోరిక తీర్చాలని ఒత్తిడి చేశాడు. అప్పు తీర్చే పరిస్థితి లేకపోవడంతో ఆమె అతడికి శారీరకంగా లొంగిపోయింది. వాళ్లు ఏకాంతంగా ఉన్నప్పుడు ఆమె తెలియకుండా వీడియో తీశాడు. ఆ వీడియో స్నేహితులకు పంపించడంతో వాళ్లు ఆమె బ్లాక్ మెయిల్ చేసి కోరిక తీర్చాలని బలవంతం చేయడంతో ఆమె షీ టీమ్స్‌కు ఫిర్యాదు చేసింది. అప్పటికే అతడి స్నేహితులు వాట్సాప్, సోషల్ మీడియాలో సదరు వీడియోను షేర్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News